Monday, May 6, 2024

దీపం లబ్దిదారులకు గ్యాస్ సిలిండర్లు

- Advertisement -
- Advertisement -

Ujwala Yojana Scheme

 

హైదరాబాద్ : గ్రేటర్ నగరంలో పేద కుటుంబాలు వంట చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉజ్వల యోజన పథకం (దీపం ) పథకం ద్వారా గ్యాస్‌సిలిండర్ల పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. గత ఏడాదిన్నర నుంచి దీపం పథకం అమలు చేయడం లేదనే ఆరోపణలకు చెక్ పెట్టి అర్హులైన సామాన్యులకు ఇచ్చేందుకు ప్రతిపాదనలు చేస్తున్నట్లు తెలుస్తుంది. కేంద్ర సర్కార్ గత ఐదేళ్లుగా హైదరాబాద్‌ను డిల్లీ తరహాలో కిరోసిన్ ప్రీ సిటిగా తీర్చిద్దిదేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

ఆహారభద్రత కార్డు లబ్దిదారులను గుర్తించి కనెక్షన్లు మంజూరు చేయడంలో విఫలం చెందారని విపక్ష పార్టీల నాయకులు ఆరోపణలు చేశారు. స్థానిక అధికారులు ఎల్పీజీ సిలిండర్ లేని కిరోసిన్ లబ్దిదారులను గుర్తించి జాబితా అందజేసిన చమురు కంపెనీలు తమవద్ద సరిపడ స్టాక్ లేదని, మరింత వచ్చినప్పుడు ఇస్తామని చెప్పి సాగదీస్తూ వచ్చాయి. దీంతో సర్కార్ పేదల నుంచి మరిన్ని విమర్శలు ఎదుర్కొంది. దీని దృష్టిలో పెట్టుకుని వచ్చే ఏడాదిలో గ్రేటర్ ఎన్నికలు ఉన్నందున్న ముందుగానే పంపిణీ చేస్తే ప్రజలకు తమకు మద్దతు పలుకుతారని ఇప్పటికే స్దానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వం పెద్దలను కోరుతున్నారు.

ప్రతి డివిజన్ పరిధిలో 1500 కుటుంబాలకు ఇవ్వాలని సూచిస్తున్నారు. నాలుగు సంవత్సరాల క్రితం సివిల్ సప్లయి అధికారులు ఎల్పీజీ కనెక్షన్లు లేని కుటుంబాలను గుర్తించి దీపం కనెక్షన్లు వర్తింపజేయాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఇందుకు నగరంలో సుమారు 1.80లక్షల కుటుంబాలను గుర్తించారు. అందులో కొంతమందికి మినహాయించి మిగిలిన కుటుంబాలకు ఎల్పీజీ కనెక్షన్ల కోసం సిఫారసు చేశాయి. అయిల్ కంపెనీలు డిస్ట్రిబ్యూటర్లు కేవలం 85వేల కుటుంబాలకు మాత్రమే కనెక్షన్లు ఇచ్చి రెండవ విడుతలో ఇస్తామన్నారు.

అందుకోసం ప్రభుత్వం మిగతావారికి వచ్చే వారం నుంచి వివరాలు సేకరించి నెలాఖరులోగా పంపిణీ చేసేందుకు జాబితా తయారు చేసినట్లు అధికారులు వివరిస్తున్నారు. గ్రేటర్ పరిధిలో కనెక్షన్లు హైదరాబాద్ లో గుర్తించినవి 112754, ఆమోదం 1,12,754, గ్రౌండింగ్ 57,826, రంగారెడ్డి జిల్లా గుర్తించినవి 32వేలు, ఆమోదం 31,735, గ్రౌండింగ్ 18,469, చేశారు. వీరందరికి వచ్చే ఏడాదిలో అందజేస్తే నగరంలో గ్యాస్ సిలిండర్‌లేని ఇళ్లు ఉండదని భావిస్తున్నారు.

మరో విడుత లబ్దిదారులను గుర్తించాలి ః మహిళ సంఘాల డిమాండ్
నగరంలో మురికివాడల్లో చాలామంది ప్రజలకు గ్యాస్ సిలిండర్లు లేవని, ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని దీపం పథకం అందజేయాలని మహిళ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో చేసిన సిలిండర్ల గుర్తింపులో అవకతవకలు జరిగాయని, మరోసారి అధికారులు సర్వేచేసి నిజమైన పేదలను గుర్తించి ఇవ్వాలని సూచిస్తున్నారు.

 

Distribution Gas Cylinders through Ujwala Yojana Scheme
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News