Friday, May 3, 2024

ఇళ్ళు లేని పేదలకు భూ పంపిణీ

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈ నెల 9న సంక్షేమ దినోత్సవం రోజున ఇండ్ల స్థలం లేని నిరుపేదలకు భూపంపిణీకి చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ విపి.గౌతమ్ కోరారు. బుధవారం ఐడిఓసి లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లాలోని తహశీల్దార్లతో నివాస స్థలాల పట్టాల పంపిణీ, బిసి కుల, చేతి వృత్తుల వారికి ఆర్థిక సహాయంపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో 58 ఎకరాల స్థలం నివాస స్థలాల పట్టాల పంపిణీకి గుర్తించినట్లు తెలిపారు. నివాస స్థలాల కేటాయింపునకు జిల్లాలో 4526 దరఖాస్తులు అందినట్లు ఆయన అన్నారు.

దరఖాస్తుల పరిశీలన పూర్తి పారదర్శకంగా చేపట్టి, అర్హులకు అందేలా చర్యలు చేపట్టాలన్నారు. పంపిణీకి అసైన్ చేయని, ఉపయోగంలో లేక ఖాళీగా ఉన్న స్థలాలు పంపిణీకి సిద్ధం చేయాలన్నారు. సంక్షేమ దినోత్సవం నాటికి అర్హులకు పట్టాల పంపిణీకి చర్యలన్ని పూర్తి చేసి, సిద్ధంగా ఉండాలన్నారు. బిసి కుల, చేతి వృత్తుల వారికి ప్రభుత్వం ఆర్థిక సహాయం క్రింద రూ.లక్ష చెక్కుల పంపిణీని ముఖ్యమంత్రి సంక్షేమ దినోత్సవం రోజున ప్రారంభిస్తారని, అదేరోజు మండలానికి 20 మంది చొప్పున అర్హులను గుర్తించి, వారికి రూ.లక్ష ఆర్థిక సహాయానికి ఓబీఎం ఎస్ లో నమోదుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలన్నారు.

అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ పూర్తి చేసి, అర్హులకు లబ్ది చేకూరేలా చూడాలని కలెక్టర్ అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్, జిల్లా రెవెన్యూ అధికారిణి ఆర్. శిరీష, బిసి సంక్షేమ అధికారిణి జి.జ్యోతి, సాంఘిక సంక్షేమ శాఖ డిడి కె.సత్యనారాయణ, ఖమ్మం అర్బన్ తహశీల్దార్ శైలజ, కలెక్టరేట్ పర్యవేక్షకులు వెంకటేశ్వర్లు, రాంబాబు, డిటి రంజిత్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News