Thursday, May 2, 2024

గిరిజనులకు పోడు పట్టాల పంపిణీ

- Advertisement -
- Advertisement -

కాటారం : పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు భూపాలపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని కాటారం, మహాముత్తారం, మహాదేవపూర్, పలిమెల, మల్హార్ మండలాలకు చెందని గిరిజనలు ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకున్న వారి వివరాలు సర్వే చేసి వారిలో అర్హులైన గిరిజన లబ్ధిదారులకు శుక్రవారం కాటారం మండలంలోని ఎల్‌జి గార్డెన్స్‌లో పట్టా పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జయశంకర్ భూపాపల్లి జిల్లా కలెక్టర్ భవేష్‌మిశ్రా, జెడ్పీ చైర్‌పర్సన్ జక్కు శ్రీహర్శిణీ రాకేష్, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు, ఐటిడిఏ పిఓ అంకిత్ హాజరై పట్టాదారు పాసుపుస్తకాలు అందజేశారు. ఐదు మండలాలకు చెందిన గిరిజనులు 59గ్రామాలు, 113 హబీటేషన్‌లో 5808 మంది గిరిజనులు 19356 ఎకరాలకు పోడు భూములకు పట్టా కొరకు ఆన్‌లైన్ చేసుకోగా అందులో 2393 మంది గిరిజనులకు అర్హులుగా గుర్తించి 6199.08 ఎకరాల భూమికి ప్రభుత్వం ద్వారా పోడు భూములకు పట్టాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన జిల్లా కలెక్టర్‌కు కాటారం సర్పంచ్ నాయిని శ్రీనివాస్ బోకే అందజేసి స్వాగతం పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News