Monday, May 13, 2024

ఎన్నికలపై అంచనాలు ప్రచురించొద్దు

- Advertisement -
- Advertisement -

Do not publish predictions on elections:Press council

 

పత్రికలకు ప్రెస్ కౌన్సిల్ సూచన

న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న ఎన్నికలపై నిషేధిత కాలంలో ఎలాంటి అంచనాలు ప్రచురించ వద్దని పత్రికలకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సూచించింది. భారత ఎన్నికల కమిషన్ నుంచి అందుకున్న సమాచారం మేరకు పత్రికలకు ప్రెస్ కౌన్సిల్ ఈ సూచన చేసింది. స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు జరిగేందుకు స్వీయ నియంత్రణ పాటించాలని ప్రెస్ కౌన్సిల్ కోరింది. అక్టోబర్ 28 ఉదయం 7గంటల నుంచి నవంబర్ 7 సాయంత్రం 630 వరకు ఫలితాలపై జోస్యాలు, అంచనాలు ఇవ్వడంపై ఎన్నికల కమిషన్ నిషేధం విధించింది. బీహార్ అసెంబ్లీకి మూడు దశల్లో ఈ తేదీల మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి. మరోవైపు పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో 28 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News