Wednesday, May 15, 2024

కరోనా సోకిన యువతితో వైద్యుడి అసభ్య ప్రవర్తన….

- Advertisement -
- Advertisement -

Doctor misbhave with Covid patient at up

ఆగ్రా: కరోనా వైరస్ సోకిన యువతితో ఓ వైద్యుడు అసభ్యంగా ప్రవర్తించడంతో అతడిని అరెస్టు చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని అలీగఢ్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఓ యువతి ఢిల్లీలోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తోంది. గత కొన్ని రోజుల నుంచి జ్వరంతో పాటు దగ్గు, గొంతు నొప్పి ఉండడంతో ఆమె కరోనా టెస్టు చేయగా పాజిటివ్ వచ్చింది. వెంటనే ఆమెను దీన్ దయాల్ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. డాక్టర్ తుఫైల్ అహ్మద్ ఐసోలేషన్ వార్డలో ఉన్న యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు. రాత్రి సమయంలో ఐసోలేషన్ వార్డుకు వైద్యుడు పిపిఇ కిట్ లేకుండా వచ్చి యువతి జననాంగాలను తాకాడు. యువతి సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని సిసి కెమెరాల దృశ్యాల ఆధారంగా సెక్షన్ 376 కింద కేసు నమోదు చేసి వైద్యుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News