Monday, April 29, 2024

ముగ్గురు ఉగ్రవాదుల్ని హతమార్చిన వీర బాలిక

- Advertisement -
- Advertisement -

Afghan girl kills Taliban terrorists

మజ్ని : దుండగులు ఎవరైనా తుపాకులతో విచ్చలవిడిగా కాల్పులు జరుపుతుంటే భయంతో పారిపోవడం తప్ప ఎవరూ ఏం చేయలేరు. కానీ అప్ఘానిస్థాన్ లోని సెంట్రల్ ఘర్ ప్రావిన్స్ లోని ఒక గ్రామంలో కమర్‌గుల్ అనే 15 ఏళ్ల బాలిక తమ ఇంటి లోకి చొరబడి తల్లిదండ్రులను కాల్చిచంపిన ఉగ్రవాదులను ధైర్యంగా ఎదిరించడమే కాదు, వారిలో ముగ్గురిని తుపాకీతో మట్టికరిపించింది. తల్లిదండ్రులు తన కళ్లెదుటే తాలిబన్ దుండగుల భీకర దాడికి ప్రాణాలు కోల్పోయినా ఆ బాలిక భయపడకుండా తనకుతాను రక్షించుకోవడమే కాదు, తన 12 ఏళ్ల తమ్ముడ్ని కూడా దుండగుల నుంచి రక్షించుకుంది. ఈ సాహసానికి ప్రజలంతా నివ్వెర పోయారు.

అప్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘని తన అధికారిక నివాస భవనానికి అక్కా తమ్ముళ్లను రప్పించుకుని ప్రశంసించారు. కమర్ గుల్ తండ్రి గ్రామానికి పెద్దగా ఉంటున్నారు. అప్ఘన్ ప్రభుత్వానికి ఆయన మద్దతు దారు. ఇది తాలిబన్లకు నచ్చలేదు. ఆయనపై ప్రతీకారం తీర్చుకోడానికి సమయం కోసం చూస్తున్నారు. ఈ నెల 17 వ తేదీ అర్ధరాత్రి తాలిబన్ ఉగ్రవాదులు కమర్ ఇంటికి వచ్చి చొరబడ్డారు. అడ్డుకున్న కమర్ తల్లిని తుపాకీతో కాల్చి చంపారు. తరువాత కమర్ తండ్రి ప్రాణాలు తీసారు.ఇంత జరిగినా కమర్ జడవ లేదు. తనతో తమ్ముణ్ణి కూడా రక్షించుకోడానికి అనేక విధాలు ప్రయత్నించింది.

తన ఇంట్లో ఉన్న ఎకె 47 తుపాకీని తీసుకుని దాదాపు 40 మంది ఉగ్రవాదులతో గంటసేపు పోరాడింది. వారికి దొరక్కుండా దాక్కుంటూ సింహంలా విజృంభించింది. ముగ్గురు ఉగ్రవాదులను మట్టి కరిపించింది. మిగతా వారు తీవ్రంగా గాయపడ్డారు. ఈలోగా గ్రామస్థులు, ప్రభుత్వ అనుకూలురైన మిలిటెంట్లు అక్కడకు చేరుకుని బాలికకు అండగా నిలిచే సరికి ఉగ్రవాదులు తోకముడిచి పారిపోయారు.

Afghan girl kills Taliban terrorists

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News