Wednesday, May 1, 2024

ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికులను తప్పుదోవ పట్టించకండి

- Advertisement -
- Advertisement -

జ్యోతినగర్: రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్ట్‌కు చెందిన కాంట్రాక్టు కార్మికుల డిమాండ్లపై కేంద్ర కార్మిక శాఖ రీజనల్ అధికారి (ఆర్‌ఎల్‌సి) సమక్షంలో చర్చలు కొనసాగుతుంటే కాంట్రాక్టు కార్మిక సంఘాల యునైటెడ్ ఫోరం నాయకులు కార్మికులను తప్పుదోవ పట్టిస్తూ ఆందోళన చేయడం సరి అయింది ఆదని ఎన్టీపీసీ హెచ్‌ఆర్ ఎజిఎం బీజయ్ కుమార్ సిక్దర్ శుక్రవారం సాయంత్రం స్థానిక విలేకరులకు తెలిపారు.

కాంట్రాక్టు కార్మికుల డిమాండ్లపై ఈ నెల 12న హైదరాబాద్‌లో రీజనల్ కార్మిక శాఖ అధికారి సమక్షంలో జరిగిన చర్చల ప్రక్రియ కొనసాగింపులో భాగంగా ఆగస్టు 10వ తేదీకి పొడగించారని అన్నారు. అప్పటి వరకు ఎన్టీపీసీలో ఎలాంటి ఆందోళన చేసిన చట్ట విరుద్ధమని, యునైటెడ్ ఫోరం నాయకులు అంగీకరించి, మళ్లీ ఆందోళన చేయడం సరైంది కాదని అన్నారు.

రామగుండం ఎన్టీపీసీకి చెందిన కాంట్రాక్టు కార్మికులకు దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్టీపీసీల కంటే అధికంగా చెల్లిస్తున్నామని, అంతేగాక రామగుండం పరిసర ప్రాంతంలో కూడా ఇతర పరిశ్రమల కంటే అధిక మొత్తంలో వేతనాలు చెల్లించడం జరుగుతుందని తెలిపారు. కార్మికులను చట్ట విరుద్ధమైన ఆందోళనకు ప్రేరేపించడం సరైంది కాదని అన్నారు.

విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్న ఎన్టీపీసీలో ఉతూపత్తికి అంతరాయం కలిగితే ప్రజల జీవనోపాధిపై ప్రభావం చూపుతుందని అన్నారు. రామగుండం ఎన్టీపీపీలో ఎస్మా చట్టం అమలులో ఉందని అన్నారు. కాంట్రాక్టు కార్మికుల డిమాండ్లపై ప్రతి వారం చర్చించి, దశల వారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు సహకరించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News