Tuesday, May 14, 2024

టెస్టులకు డుప్లెసిస్ గుడ్‌బై

- Advertisement -
- Advertisement -

Du Plessis announces Retirement from Test Cricket

జోహెన్నస్‌బర్గ్: దక్షిణాఫ్రికా సీనియర్ క్రికెటర్ ఫాఫ్ డుప్లెసిస్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నట్టు బుధవారం ప్రకటించాడు. వన్డేలు, టి20లపై దృష్టి పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించాడు. 2012లో టెస్టు క్రికెట్‌కు శ్రీకారం చుట్టిన డుప్లెసిస్ 69 మ్యాచుల్లో సౌతాఫ్రికాకు ప్రాతినిథ్యం వహించాడు. 40 సగటుతో 4,163 పరుగులు చేశాడు. ఇందులో 10 శతకాలు, మరో 21 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక డుప్లెసిస్ మూడు ఫార్మాట్‌లలోనూ దక్షిణాఫ్రికాకు ప్రాతినిథ్యం వహించాడు. అంతేగాక ఐపిఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇదిలావుండగా డుప్లెసిస్ అనూహ్యంగా తీసుకున్న నిర్ణయంతో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు షాక్‌కు గురైంది.

Du Plessis announces Retirement from Test Cricket

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News