Wednesday, May 8, 2024

దుబాయ్ ప్రధాని షేక్‌తో సంరక్షణ వివాదంలో మాజీ భార్య విజయం

- Advertisement -
- Advertisement -

Dubai princess wins $733 million from sheikh

733 మిలియన్ డాలర్లు చెల్లించాలని లండన్ హైకోర్టు ఆదేశం

లండన్ : దుబాయ్ పరిపాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్‌మెక్తోమ్ తన మాజీ భార్యకు, ఇద్దరు పిల్లలకు సంరక్షణ వివాదం పరిష్కారం కోసం 733 మిలియన్ డాలర్లు (554 మిలియన్ పౌండ్లు) చెల్లించాలని లండన్ హైకోర్టు ఆదేశించింది. రషీద్ మాజీ భార్య రాణీ హయా బింత్ అల్ హుస్సేన్ . ఆమె జోర్డాన్ రాజు అబ్దుల్లాకు సోదరి అవుతారు. ఆమెకు, వారి ఇద్దరి పిల్లలకు రషీద్ నుంచి ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా జీవితాంతం రక్షణ కల్పించాలని జడ్జి ఫిలిప్ మూర్ తన తీర్పులో ఆదేశించారు.

భద్రత తప్ప ఆమె తన కోసం ఈ నగదు అవార్డు అడగడం లేదని, వివాహ బంధం రద్దయిన తరువాత కోల్పోయిన ఆస్తులకు సంబంధించి నష్టపరిహారాన్ని ఆమె కోరుతున్నారని జడ్జి వివరించారు. మాజీ భార్య హయాకు తన బ్రిటిష్ కాలం నాటి భవనాల నిర్వహణ, సుందరీకరణ కోసం మూడు నెలల్లో 251.5 మిలియన్ పౌండ్లు చెల్లించాలని కోర్టు షేక్ మొహమ్మద్‌ను ఆదేశించింది. భవిష్యత్ భద్రత కోసం కావలసిన ఖర్చులకు నగలు, రేస్ గుర్రాలను నిర్వహించవలసి ఉందని రాణీ హయాబింత్ పేర్కొన్నారు.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉపాధ్యక్షుడు, ప్రధాని అయిన షేక్ తన పిల్లలు 14 ఏళ్ల జలీలా, 9 ఏళ్ల జాయేద్ చదువుల కోసం 3 మిలియన్ పౌండ్లు, బకాయిల చెల్లింపు కోసం 9.6 మిలియన్ పౌండ్లు చెల్లించాలని కోర్టు స్పష్టం చేసింది. పిల్లల పెంపకానికి, పెద్దవాళ్లయిన తరువాత వారి భద్రతకు ఏటా 11.2 మిలియన్ పౌండ్లు చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News