Sunday, April 28, 2024

బరిలో నిలిచేదెవరు… గెలిచేదెవరు ?

- Advertisement -
- Advertisement -

Dubbaka byelection campaign

 

నోటిఫికేషన్ రాకముందే ఉరుకులాట
ప్రారంభోత్సవాలతో అదరగొడుతున్న టిఆర్‌ఎస్
అభ్యర్థి వేటలో కాంగ్రెస్
కేడర్ పెంచుకునే దిశలో బిజెపి
మేముకూడా బరిలో అంటూ స్వతంత్రులు
దుబ్బాక ఉప ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే సిత్రాలు,విచిత్రాలు

మన తెలంగాణ/సిద్దిపేట అర్బన్ : సిద్దిపేట జిల్లా దుబ్బాక నియెజకవర్గ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యం కారణంగా మృతి చెందడంతో అక్కడ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండగా అన్ని రాజకీయ పార్ట్టీలు దుబ్బాక నియెజకవర్గం వైపు దృష్టి పెట్టాయి. ఇక స్థానికంగా ఉన్న నేతలు సైతం తమ తమ రాజకీయ పార్టిలనుండి టికెట్ తెచ్చుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు ముమ్మరం చేయడమే కాకుండా సోషల్ మీడియాలో ఆ యా పార్టీల అభ్యర్థిత్వం తనకే దక్కుతుందని ప్రచారం చేసుకోవడం గమనార్హం. గతంలో చాలా చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలు,ఎంపిలు మృతి చెందితే అన్ని రాజకీయ పార్టిలు ఒక మాటా చెప్పుకొని ఎకగ్రీవానికి ఒప్పుకునేవి కాని దుబ్బకా నియెజకవర్గంలో అలాంటి ఆశలు లేకుండాపోవడమే కాకుండా ఆ యా రాజకీయ పార్టీల అభ్యర్థులే కాకుండా దుబ్బాక లో ఈ సారి స్వతంత్రంగా పోటీ చేసే అభ్యర్థులు కూడా అధికంగా ఉండొచ్చనే ప్రచారం జరుగుతుంది.

ఒక వైపు టిఆర్‌ఎస్ పార్ట్టీ నుండి సోలిపేట తనయుడు సతీష్‌రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని నాయకుల్లో నమ్మకం ఉండగా అధిష్టానం ఈ సారి సోలిపేట భార్యకు టికెట్ ఇస్తుందన్న ప్రచారం ముమ్మరంగా సాగుతుంది .అది ఎలాగున్న టిఆర్‌ఎస్ టికెట్ సోలిపేట కుటుబం నుండి ఒకరికి తప్ప ఇతరులకు ఇచ్చే పరిస్థితి లేకపోవడం గమనించదగ్గ విషయం. అలాగే టిఆర్‌ఎస్‌లో ట్రబుల్ షూటర్‌గా పేరొందిన రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు దుబ్బాక నియెజకవర్గంలో వారం రోజుల నుండి హల్‌చల్ చేస్తు, ప్రభుత్వ పథకాలు ప్రారంభోత్సవాల్లో చురుకుగా పాల్గ్గొంటు టిఆర్‌ఎస్ క్యాడర్‌ను ట్రాక్ తప్పకుండా చూడడంతో సిట్టింగ్ స్థానాన్ని గెలుపు కోసం కృషిచేస్తున్నారు. రానున్న ఉప ఎన్నికల్లో లక్ష మెజారిటి సాధిస్తామని మంత్రి హరీశ్‌రావు ఉటంకించడం కొసమెరుపు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెవెన్యూ చట్టం ప్రజలకు ఎంతో మేలు చేయనుందో ప్రజలకు వివరిస్తునే గ్రామల్లో ఆయా సంఘాల ఆధ్వర్యంలో చేపట్టే రెవెన్యూ చట్టం మద్దతు ర్యాలీల్లో పాల్గ్గొంటున్నారు. ఇక కాంగ్రేస్ పార్ట్టీ విషయానికి వస్తే పార్టి టికెట్ ఆశిస్తున్న వారిలో చాల మంది ఉండడం గమనార్హం.

ఎవరికి వారు వారి వారి మద్దతు దారులతో అధిష్టానం వద్ద బల నిరూపణ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కాంగ్రేస్ పార్టి టికెట్ ఆశిస్తున్న వారిలో రాజక్కపెట గ్రామానికి చెందిన కోమటి రెడ్డి వెంకటనర్సింహరెడ్డి, దౌల్తాబాద్ మండలానికి చెందిన కర్ణాల శ్రీనివాస్,గతంలో మెదక్ ఎంపిగా పోటీ చేసి ఒడిపోయిన దాసోజు శ్రవణ్ కుమార్,ఓబిసి రాష్ట్ర నాయకుడు నంద్యాల శ్రీనివాస్ ఉన్నారు.కాంగ్రేస్ అదిష్టానం ఇప్పటికే పలు మార్లు మీటింగ్‌లు పెట్టి టికెట్ ఇచ్చే విషయంలో పలు చర్చలు జరిపినట్లు సమాచారం. నాయకులు తమకే టికెట్ వస్తుందని ఎవరికి వారే నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక బిజేపి పార్టి విషయానికి వస్తే ఇప్పటికే దుబ్బాక నియెజకవర్గంలో బిజెపి అగ్రనేత రఘునందన్‌రావు పార్టి టికెట్ ఆశిస్తుండగా మరో బిజేపి నేత తోట కమలాకర్‌రెడ్డి కూడా పార్టి తనకే టికెట్ ఇస్తుందని ప్రయత్నాలు మొదలు పెట్టారు. పార్టి టికెట్‌తో సంబంధం లేకుండా ఇరువురు నాయకులు దుబ్బాక నియెజకవర్గంలోని గ్రామంలో విస్త్రత పర్యటణలు చేపట్టి కేంద్ర ప్రభుత్వం చెపడుతున్న పథకాలను ప్రజల్లో తీసుకెళుతున్నారు.

అలాగే గ్రామాల్లో యువతను కమీటీల్లో భాగాస్వామ్యం చేస్తు బిజెపి జెండావిష్కరణలు చేస్తున్నారు.కాని బిజెపికి బలమైన క్యాడర్ ఇప్పుడిప్పుడే తయారు అవుతుండడం బిజెపి టికెట్ ఆశిస్తున్నవారు ఇద్దరు అగ్రనేతలు ఉండడంతో కార్యకర్తలకు తలనొప్పిగా మారిందని ప్రజలు అనుకోవడం గమనార్హం. ఇక రాజకీయ పార్టిలు ఎవరికి టికెట్ ఇచ్చిన పోటీ రసవత్తరంగా మారనుంది కారణం స్వతంత్రులు దుబ్బాక నియెజక వర్గంలో రానున్న ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు చాల మంది వరకు నిలబడతారనే చర్చ జోరుగా సాగతుండడం రాజకీయ పార్టిల అభ్యర్థులకు తలనొప్పిగా మారనుందనడంలో సందేహం లేదు. బహుజన సమాజం నుడి భూపంల్లి మధు పోటీ చేయనుండగా.

గతంలో విసిక్స్ టివిలో ఆంకర్‌గా పనిచేసిన కత్తి కార్తిక కూడా పోటీలో నిలవనుండి ఆమె గౌడ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, ఇప్పటికే దుబ్బాకలో పలు మార్లు పర్యటించడం మిగతావారికి కంటిగింపుగా మారింది. ఏది ఏమైన ఎన్నికలకు నోటిఫికేషన్ రాకముందే ఇంత జరుగుతుంది ఇక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడితే ఇంకా ఎంత మంది పోటీలో నిలుస్తారో అన్న సందేహం అక్కడి ప్రజల్లో ఉండడం కొసమెరుపు. ఇక బరిలో ఎవరు నిలుస్తారో, పోటీలో ఎవరు గెలుస్తారోల అంటు ప్రతి చౌరస్తాలో ప్రజలు చర్చలు జరుపుకోవడం గమనార్హం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News