Friday, April 26, 2024

నేడు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ప్రారంభం

- Advertisement -
- Advertisement -

Today the Durgam cheruvu cable bridge starts

 

ప్రారంభించనున్న మంత్రి కెటిఆర్ 
ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

మన తెలంగాణ/సిటీ బ్యూరో: భాగ్యనగరానికి మరో మణిహారంగా భాసిల్లనున్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నేడు ప్రారంభం కానుంది. కేబుల్ బ్రిడ్జితో పాటు రోడ్డు నెంబర్ 45లో నిర్మించిన 4 లైన్ ఎలివేటెడ్ కారిడార్‌ను పురపాలక శాఖమంత్రి కె.తారక రామారావు శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభించనున్నారు. మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జరగనున్న ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, అతిథులుగా డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావు, మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, వి. శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ, రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, పార్లమెంట్ సభ్యులు జి.రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్, టిఎస్‌ఐఐసి ఛైర్మన్ జి.బాలమల్లు, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ పాల్గొనున్నారు.

దుర్గం చెరువు ప్రత్యేకతలు

దేశంలోనే అతి పెద్ద మొట్ట మొదటిది దుర్గుం చెరువు కేబుల్ బ్రిడ్జి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఏర్పాటు చేసిన లైటింగ్ ఈ బ్రిడ్జికు ప్రత్యేక ఆక్షరణగా నిలవనుంది. స్టే కేబుల్స్‌కు ఏర్పాటు చేసిన లైటింగ్ ద్వారా బ్రిడ్జిపై అసలు చీకటి అనేదే (కనీసం నీడ) కూడా కనిపించకుండా ఉండడమే కాకుండా వెలుగు విరజిమ్ముతు ఉంటుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News