Wednesday, February 21, 2024

దుబ్బాకలో హోరాహోరీ

- Advertisement -
- Advertisement -

ముక్కోణ పోటీలో బలమైన అభ్యర్థులు 
గులాబీ జెండా ఎగరేయడానికి బిఆర్‌ఎస్ ప్రయత్నం 
ముత్యంరెడ్డి సానుభూతితో కాంగ్రెస్ పోరాటం 
మరోసారి సత్తాచాటేందుకు బిజెపి తహతహ 

(ఎల్.మల్లేష్/తొగుట)
ఎంపిగా ఒకరు, ఎమ్మెల్యేగా మరొకరు, తండ్రి రాజకీయ వారసుడిగా ఇంకొకరు దుబ్బాక నియోజకవర్గంలో ఎన్నికల రణరంగంలో తలపడుతున్నారు. రెండు పర్యాయలు ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్‌రెడ్డి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా మొదటిసారి పోటీలో నిలిచి ఎమ్మెల్యేగా గెలుపొందాలని ప్రయత్నిస్తున్నారు. గత ఉపఎన్నికలో సంచలన విజయం సాధించిన రఘునందన్‌రావు మరోసారి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగి సాధారణ ఎన్నికలోనూ సత్తాచాటి దుబ్బాక బాద్‌షా అనిపించుకోవాలనితహతహలాడుతున్నారు. దివంగత మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి చేసిన సేవలతో ఆయ న తనయుడు చెరుకు శ్రీనివా్‌సరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రెండోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నియోజకవర్గ ఓటర్లు ఎవరికి పట్టం కడుతారో వేచిచూడాలి.
కార్యకర్తల బలంతో కొత్త ప్రభాకర్‌రెడ్డి బీఆర్‌ఎస్‌కి గ్రామస్థాయి నుంచి ఉన్న కార్యకర్తలే బలంగా నిలుస్తున్నారు. నియోజకవర్గంలో సుమారు 67 వేల సభ్యత్వాలు ఉండటం గమనార్హం.

రెండు పర్యాయాలు పార్లమెంటుకు పోటీచేసిన కొత్త ప్రభాకర్‌రెడ్డి దుబ్బాక నియోజకవర్గం నుంచే అత్యధిక మెజార్టీని సాధించారు. తొలిసారి అసెంబ్లీ బరిలోకి నిలవగా అదే ఊపు కొనసాగుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అంతేకాకుండా సీఎం కేసీఆర్‌కు దుబ్బాకతో ఉన్న అనుబంధం కూడా బీఆర్‌ఎ్‌సకు మరింత బలంగా కనిపిస్తోంది. ఆయన టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచే నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో గులాబీ జెండాను ఎగరేశారు. అప్పటివరకు టీడీపీ కంచుకోటగా ఉండగా సిద్దిపేట కంటే ఎక్కువ ఫలితాలను స్థానిక సంస్థలో పొందారు. ప్రస్తుతం కూడా నియోజకవర్గంలో స్థానిక సంస్థలన్ని ఆపార్టీ చేతిలోనే ఉన్నాయి. ప్రభుత్వ పథకాలు కూడా కలిసివచ్చే విషయంగా చెప్పవచ్చు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నీళ్ల ద్వారా అత్యధికంగా వరిసాగు చేసిన నియోజకవర్గంగా నిలిచింది. రైతుల నుంచి సానుకూల వాతావరణం కనిపిస్తోందని గులాబీ నేతలు చెబుతున్నారు. ఇటీవల ప్రచారంలో కేపీఆర్ కత్తిపోటుకు గురికాగా సానుభూతి కలిసొస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

బలమైన అభ్యర్థిగా రఘునందన్‌రావు

వామపక్ష భావజాలం కలిగిన దుబ్బాకలో బీజేపీ జెండా ను పాతి సంచలనం రేపిన రఘునందన్‌రావు ప్రచారంలో దూసుకెళుతున్నారు. ఆయన 2014లో అప్పటి బీఆర్‌ఎస్ అభ్యర్థి రామలింగారెడ్డి మీద పోటీచేసి డిపాజిట్ కోల్పోయారు. 2018లోనూ అదే పరిస్థితి ఎదురైంది. ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణంతో జరిగిన ఉపఎన్నికలో గెలిచి రాష్ట్రంలో సంచలనం సృష్టించారు. గత ఉపఎన్నికలో పార్టీ అండదండలు పుష్కలంగా లభించగా ప్రస్తుతం తానే కర్త, కర్మ, క్రియగా ఎన్నికల క్షేత్రంలో కొట్లాడుతున్నారు. కేంద్ర పథకాలు, బీఆర్‌ఎస్ ఆగడాలను వివరిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు.

తండ్రి సేవలే ప్రచారస్త్రంగా శ్రీనివా్‌సరెడ్డి

దివంగత మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి అం టేనే దుబ్బాక అభివృద్ధిగా చెప్పుకుంటారు. తన తండ్రి చేసిన సేవలే గెలిపిస్తాయనే ధీమాతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివా్‌సరెడ్డి ఉన్నారు. గత ఉపఎన్నికల్లో మూడో స్థానం పొందిన ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించక ముందే నుంచే గ్రామాల్లో భరోసా యాత్ర నిర్వహించి ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News