Thursday, May 2, 2024

‘దమ్ మసాలా’ ఫుల్ సాంగ్ వచ్చేసింది..

- Advertisement -
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రం చిత్రం ‘గుంటూరు కారం’. ఈ మూవీపై అభిమానులతోపాటు సినీ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి పస్ట్ సింగిల్ ‘దమ్ మసాలా’ను పూర్తి సాంగ్ ను విడుదల చేశారు. ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

కాగా, ఈ మూవీలో మహేష్ బాబు సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఎస్.రాధాకృష్ణ (చిన‌బాబు) భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. ‘గుంటూరు కారం’ చిత్రం సంక్రాంతి కానుకగా 2024, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News