Sunday, April 28, 2024

దసరా, దీపావళి పండగ సీజన్‌కు ఆన్‌లైన్ సేల్స్ వార్..

- Advertisement -
- Advertisement -

పండగ సీజన్‌కు ఆన్‌లైన్ సేల్స్ వార్ 
భారీ డిస్కౌంట్లతో అమెజాన్ ఫ్లిప్‌కార్ట్ పోటాపోటీ
ఈనెల 16 నుంచి సేల్స్ ప్రారంభం

ముంబై: దసరా, దీపావళి పండగ సీజన్‌కు ఇకామర్స్ కంపెనీల అమ్మకాల హంగామా అంతా ఇంతా కాదు. ఇకామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు భారీ ఆఫర్లతో వినియోగదారులకు గాలం వేస్తాయి. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ బిలియన్ డేస్’ పేరిట ఆఫర్లకు తెరతీసింది. ఆ తర్వాత కొద్ది రోజులకే అమెజాన్ తన ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ సేల్‌ను కూడా ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ విక్రయాలు ఒకే సమయంలో ఉన్నాయి. అయినప్పటికీ అనేక రకాల ఆఫర్లు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. అయితే, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ విక్రయాలు అక్టోబర్ 16న ప్రారంభం కానుండగా, అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ అక్టోబర్ 17న షురూ అవుతుంది.

అయితే, అమెజాన్ ప్రైమ్ మెంబర్స్‌కు సేల్స్ ఒక రోజు ముందు అక్టోబర్ 16 నుంచి ఉంటే, ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యుల అమ్మకం అక్టోబర్ 15 నుంచి ప్రారంభమవుతుంది. ఫ్లిప్‌కార్ట్ అమ్మకాలకు చివరి తేదీ అక్టోబర్ 21 నిర్ణయించగా, అమెజాన్ తన అమ్మకాల చివరి తేదీని ప్రకటించలేదు. మరోవైపు మింత్రా ‘బిగ్ ఫ్యాషన్ ఫెస్టివల్’ కూడా ఈనెల 16 నుంచి ప్రారంభమ వుతుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అమ్మకాలు ఒకే విధంగా ఉండొచ్చు, కానీ రెండింటి మధ్య పెద్ద వ్యత్యాసం ఉంది. రెండు ప్లాట్‌ఫామ్‌లు అమ్మకాల కోసం పలు రకాల ప్రముఖ బ్రాండ్‌లతో జతకట్టాయి. ఇక్కడ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అందించే కొన్ని ప్రసిద్ధ లాంచ్‌ల గురించి ఇలా ఉన్నాయి.
ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ ఉత్పత్తులు
గూగుల్ పిక్సెల్ ప్రోడక్ట్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌లో ప్రత్యేకంగా లభిస్తుంది. బిగ్ బిలియన్ డేస్ సందర్భంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గూగుల్ పిక్సెల్ 4ఎ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 30 వేల నుంచి రూ.35 వేల మధ్య అందుబాటులో ఉంటుంది.
అమెజాన్‌లో వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్
గూగుల్ పిక్సెల్ ఉత్పత్తుల అమ్మకం ఫ్లిప్‌కార్ట్‌లో ఉంటే ఇక్కడ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ సేల్స్ అమెజాన్‌లో అందుబాటులో ఉంటాయి. వన్‌ప్లస్ తన నెక్స్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 8టిని అక్టోబర్ 14న భారతదేశంలో విడుదల చేస్తోంది. ఇది అమెజాన్‌లో ప్రత్యేకంగా అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ నవంబర్‌లో ఎప్పుడైనా అమ్మకానికి రావొచ్చు. అమెజాన్ సెల్ సుమారు ఒక నెల పాటు ఉంటేనే, అమ్మకం సమయంలో వన్‌ప్లస్ 8టిని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.
ఫ్లిప్‌కార్ట్‌లో పెద్ద శ్రేణి స్మార్ట్ టివిలు
బిగ్ బిలియన్ సేల్ సందర్భంగా విస్తృత శ్రేణి స్మార్ట్ టివిలను అందించడానికి ఫ్లిప్‌కార్ట్ నోకియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. వివిధ వేరియంట్లలో ఆరు స్మార్ట్ టీవీలను కంపెనీ విడుదల చేసింది. స్మార్ట్ టివిల్లో 32 అంగుళాల టీవీలకు రూ .12,999, హెచ్‌డి 43 అంగుళాల టీవీలకు రూ.22,999 ఉండగా, పూర్తి హెచ్‌డి వేరియంట్ల ధర రూ.28,999గా ఉంది. 50 అంగుళాల టివి ధర రూ.33,999, 55 అంగుళాల ధర రూ.39,999, 65 అంగుళాల టివి ధర రూ .59,999గా ఉంది.
అమెజాన్‌లో ఎకో ఉత్పత్తులు
ఇటీవల ప్రారంభించిన ఎకో డాట్ అమెజాన్ గ్రేడ్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా లభిస్తుంది. ఇందులో ఎకో డాట్, ఎకో డాట్ విత్ క్లాక్, అమెజాన్ ఎకో, ఫైర్ టివి స్టిక్, అలెక్సా వాయిస్ రిమోట్ లైట్ తో ఫైర్ టివి స్టిక్ లైట్ ఉన్నాయి.
బ్యాంకు కార్డులపై ప్రత్యేక తగ్గింపు
అమెజాన్ ఫ్లిప్‌కార్ట్ అమ్మకాల సమయంలో అనేక బ్యాంకుల కార్డులపై డిస్కౌంట్‌ను అందిస్తున్నాయి. అమెజాన్ సంస్థ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులు, అలాగే ఇఎంఐ లావాదేవీలపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఇదే కాకుండా డెబిట్, క్రెడిట్ కార్డ్, బజాజ్ ఫిన్సర్వ్ నో-కాస్ట్ ఇఎంఐతో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్లను అందిస్తున్నాయి. మరోవైపు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బిఐ) డెబిట్, క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు ఫ్లిప్‌కార్ట్ 10 శాతం తగ్గింపును ఇస్తోంది.

E Commerce Festival Sale begins from Oct 16

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News