Wednesday, March 22, 2023

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరుణ్ పిళ్లై అరెస్టు!

- Advertisement -

హైదరాబాద్: నగరంలోని వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైని ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడి) అరెస్టు చేసింది. న్యూఢిల్లీలో ఆయనను ప్రశ్నించిన తర్వాత సోమవారం రాత్రి ఈడి కస్టడీలోకి తీసుకుంది. దీనికి ముందు ఈడి నగరంలోని కోకాపేట్‌లో ఉన్నా ఆయన నివాసంపై సోదాలు నిర్వహించింది. ఆయన ఆస్తులను జప్తు చేసుకుంది. సౌత్ లిక్కర్ తయారీదార్ల గ్రూప్‌లో పిళ్లై ముఖ్యవ్యక్తిగా(ఫ్రంట్‌మ్యాన్) ఉన్నారు. ఆయన మరో నిందితుడు ఇండోస్పిరిట్ మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ మహేంద్రు నుంచి లంచం తీసుకుని మిగతా నిందితులకు అందజేసినట్లు దర్యాప్తు సంస్థ తెలిపింది.

పిళ్లైకి ఇండోస్పిరిట్‌లో 32.5 శాతం వాటా ఇవ్వబడింది. కార్టెలైజేషన్ కారణంగా రూ. 68 కోట్ల లాభాన్ని ఆర్జించారు. అందులో రూ. 29 కోట్లను పిళ్లై ఖాతాలకు బదిలీ చేశారు. జనవరిలో హైదరాబాద్‌లో పిళ్లైకి చెందిన రూ. 2.25 కోట్ల విలువైన భూభాగాన్ని ఈడి జప్తు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News