Sunday, April 28, 2024

నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, చోక్సీల ఆస్తులు జప్తు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఆర్థిక నేరగాళ్ళు విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల నుంచి ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రకటించింది. మొత్తం రూ.18,170.02 కోట్లు స్వాధీనం చేసుకున్న ఈడీ.. ఇందులో రూ.9,371.17 కోట్లను ప్రభుత్వ రంగ బ్యాంకులకు బదిలీ చేయగా, మిగిలిన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేసినట్లు ట్వీట్టర్లో వెల్లడించింది. ప్రభుత్వ రంగ బ్యాంకులకు జరిగిన రూ.22,585.83 కోట్ల నష్టంలో 80.45 శాతం (రూ.18170.02) విలువగల ఆస్తులను జప్తు చేసినట్లు తెలిపింది. జప్తు చేసిన ఆస్తుల్లో రూ.969 కోట్ల విలువైన విదేశీ ఆస్తులు కూడా ఉన్నాయని తెలిపింది. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలు అనేక ప్రభుత్వ రంగ బ్యాంకులను మోసం చేసి, విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. ఈ ముగ్గురు ఆర్థిక నేరగాళ్లను తిరిగి భారత్ కు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు ఈడీ పేర్కొంది.

ED Seizes assets of Mallya and Nirav modi and Choksi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News