Sunday, April 28, 2024

రియాల్టీ ఢమాల్

- Advertisement -
- Advertisement -

realestate

 

పడిపోయిన 50 శాతం అమ్మకాలు
జనవరి నుంచి మార్చి మధ్య కాలంలో
అమ్ముడుపోయిన 2,680 ఆస్తులు
హౌజింగ్ బ్రోకరేజ్ అనరాక్ కన్సల్టెన్సీ నివేదికలో వెల్లడి

మన తెలంగాణ/హైదరాబాద్ : రియల్టీపై కరోనా వైరస్ ప్రభావం పడింది. లాక్‌డౌన్ కొనసాగుతోన్న నేపథ్యంలో గృహాల అమ్మకాలు, నిర్మాణ పనులు ఆలస్యం అవుతున్నాయని హౌజింగ్ బ్రోకరేజ్ అనరాక్ కన్సల్టెన్సీ తెలిపింది. 2020 జనవరి నుంచి మా ర్చి మధ్య గృహాల అమ్మకాలు 50 శాతం పడిపోయినట్టుగా తమ నివేదికలో పేర్కొంది. జ నవరి నుంచి మార్చి మధ్య కాలంలో 2,680 నివాస ఆస్తులు మాత్రమే అమ్ముడయ్యాయని తెలిపింది. 2019 సంవత్సరంలో మొదటి త్రైమాసిక అమ్మకాలు 5,400 యూని ట్లుగా ఉన్నాయని ఆ సంస్థ తెలిపింది. ‘కొనసాగుతున్న ప్రపంచ ఆరోగ్య సంరక్షణ విపత్తు కారణంగా’ భారతదేశంలోని మొదటి 7 నగరా ల్లో గృహ అమ్మకాలు, కొత్త ప్రాజెక్టు ప్రార ంభాలు వార్షిక, త్రైమాసిక ఫలితాలు తగ్గాయ ని అనరాక్ కన్సల్టెన్సీ నివేదికలో తెలిపింది.

మార్చిలో గృహ అమ్మకాల్లో క్షీణత
లాక్‌డౌన్ ప్రకటించినప్పటి నుంచి జనవరి, ఫిబ్రవరి నెలతో పోల్చుకుంటే మార్చిలో గృహ అమ్మకాల్లో క్షీణత కనిపించిందని తెలిపారు. అనరాక్ కన్సల్టెన్సీ నివేదిక ప్రకారం 2020 మొదటి మూడు నెలల్లో హైదరాబాద్‌లో కొత్త నిర్మాణాలు 11 శాతం తగ్గాయని పేర్కొంది. సాధారణంగా గుడిపడ్వా, అక్షయతృతీయ, నవరాత్రి, ఉగాది పండుగల సమయాల్లో కొత్త ప్రాజెక్టుల ప్రారంభానికి సమయమని, ఈ సంవత్సరం చాలా మంది బిల్డర్లు వాటికి దూరంగా ఉన్నారని ఆ సంస్థ తెలిపింది. పని ఆగిపోయి వారం రోజులు మాత్రమేనని, లాజిస్టికల్ సమస్యలతో సహా ఇతర అంశాలు కూడా ఇందులో ఇమిడి ఉన్నాయని, ఇవే ఈ రంగం మందగించడానికి దారితీశాయని ఆ సంస్థ తెలిపింది. ఇళ్లు కొన్నవారు సైతం ప్రస్తుత పరిస్థితుల్లో గృహ ప్రవేశం చేసే అవకాశాలు కనిపించడం లేదని పేర్కొంది.

ఏడు ప్రధాన నగరాల్లో15.62 లక్షల గృహాలు నిర్మాణంలో
దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో సుమారు 15.62 లక్షలకు పైగా గృహాలు నిర్మాణంలో ఉన్నాయని, ఇవి 2013, 2019 మధ్య కాలంలో ప్రారంభమైన గృహాలేనని తన నివేదికలో తెలిపింది. హైదరాబాద్‌లో 64,250 యూనిట్లు, ఎంఎంఆర్‌లో అత్యధికంగా 4.65 లక్షల గృహాలు, ఎన్‌సిఆర్‌లో 4.25 లక్షలు, పుణేలో 2.62 లక్షలు, బెంగళూరులో 2.02 లక్షలు, కోల్‌కత్తాలో 90,670, చెన్నైలో 54,200 యూనిట్లు ఉన్నాయని ఆ సంస్థ పేర్కొంది. నిర్మాణ సంస్థల ఆదాయం మీద లాక్ డౌన్ ప్రతికూల ప్రభావం చూపిస్తుందని ఆ సంస్థ తెలిపింది.

Effect of corona virus on realty
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News