Sunday, April 28, 2024

ఎన్నికల నియమావళిని పాటించాలి

- Advertisement -
- Advertisement -
  • జిల్లా ప్రింటర్స్ సమావేశంలో కలెక్టర్ కె. శశాంక

మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి: ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎన్నికల నియమావళికి అనుగుణంగా జిల్లాలోని ప్రింటింగ్, పబ్లిషర్లు ప్రత్యేక జాగ్రత్తలు పాటిస్తూ ముద్రణ పనులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్‌తో కలసి ప్రింటర్స్ యాజమాన్యాలతో ఎన్నికల నియమావళిపై అవగాహన సమావేశం నిర్వమించారు.

ఈ మేరకు ప్రింటింగ్ ప్రెస్ యజమానులు ఎన్నికల నియమావళిని పాటిస్తూ ఎన్నికలకు సంబంధించిన కరపత్రాలు,ఇతర ప్రింటింగ్ పనులు నిర్వహించే ముందు విధిగా (మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ) డీపీఆర్వో ద్వారా అనుమతి తీసుకోవాలని సూచించారు. ఎన్ని పత్రాలు, ఎవరి కోసం చేస్తున్నారనే వివరాలు తెలుసుకుని వాటిని ముద్రించాలని కోరారు. ఎన్నికల నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తే కఠినంగా చర్యలు తీసుకోవాల్సి వస్తోందని హెచ్చరించారు. అందుకోసం ప్రింటింగ్ చేసే ముందు యాజమాన్యం ప్రింటింగ్ చేసే వారి పూర్తి వివరాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఈ మేరకు ప్రింటింగ్ యజమానుల అనుమానాలను కలెక్టర్ నివృత్తి చేశారు.

ఎన్నికలకు సంబంధించిన ప్రచురణ అభ్యర్థి, రాజకీయ పార్టీల ఖర్చు కిందకు వస్తుందని, ఎన్ని ప్రతులు ప్రింట్ చేశారో, ఎవరి కోసం చేశారో వారి పూర్తి వివరాలను ఉంచుకోవాలన్నారు. ఎన్నికల నయమావళిని పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రింటింగ్ చేయాలని కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో ఎంసిసి నోడల్ అధికారిని నర్మద, ఎన్నికల వ్యయ నిర్వాహకులు డిసిఓ సయ్యద్ ఖర్షీద్, మహబూబాబాద్, మరిపెడ, తొర్రూరు మండలాలల ప్రింటింగ్ ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News