Thursday, May 2, 2024

ఆసిఫాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ పదవికి ఎన్నికలు నిర్వహించాలి

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర ఎన్నికల సంఘానికి డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు

మన తెలంగాణ/ హైదరాబాద్: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవికి తక్షణమే ఎన్నికలు నిర్వహించి ఎస్టీ మహిళను ఎన్నుకునేలా చట్టప్రకారం చర్యలు చేపట్టాలని బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి పార్థసారధికి ఫిర్యాదు చేసినానంతరం మీడియాకు ప్రకటన విడుదల చేశారు. పంచాయితీ రాజ్ చట్టం- 2018 ప్రకారం ఏజెన్సీ ఏరియాలోని ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ చైర్ మెన్ పదవికి ఎస్టీ మహిళకు రిజర్వ్ చేయబడ్డ స్థానంలో జనరల్ కేటగిరీకి చెందిన ప్రస్తుత జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావును తాత్కాలికంగా చైర్మన్ గా ఎంపిక చేయడం రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకమన్నారు.

రాజ్యాంగం ప్రకారం ఆదివాసీ, గిరిజన మహిళలకు కేటాయించిన స్థానంలో దక్కిన హక్కులను ఆధిపత్య వర్గాలు తమ చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లాలో 15 జెడ్పీటిసిలకు నలుగురు ఆదివాసి,గిరిజన మహిళలు జెడ్పీటిసిలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎటువంటి కాలయాపన చేయకుండా తక్షణమే ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవికి ఎన్నికలు నిర్వహించి ఆ స్థానంలో ఎస్టీ మహిళను ఎంపిక చేయాలని కోరారు. ఇందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి ఎన్నికలు జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ కార్యదర్శి అర్షద్ హుస్సేన్,రాష్ట్ర కార్యదర్శి కందికంటి విజయ్ కుమార్ ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News