Sunday, April 28, 2024

విద్యుత్ అధికారులు అప్రమత్తంగా వుండండి: సిఎండి జి రఘుమా రెడ్డి

- Advertisement -
- Advertisement -

Be vigilant about electricity Says CMD Raghuma Reddy

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గులాబ్ తుఫాన్ ప్రభావం వల్ల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వలన విద్యుత్ సరఫరా లో ఎలాంటి అవాంతరాలు మరియు ప్రమాదాలు లేకుండా చూడాలని చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ జి రఘుమా రెడ్డి విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.

మూసి నది, చెరువుల పరిసర ప్రాంతాల్లో గల కాలనీలను, బస్తీలను ప్రత్యేకంగా తనిఖీ చేయాలి. మూసి నదిలో, చెరువులలో నీటి ప్రవాహం పెరిగి ముంపు ఏర్పడే అవకాశమున్నందున విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి. అపార్ట్మెంట్ సెల్లార్లలో నీరు చేరి ప్యానల్ బోర్డు ఇతర విద్యుత్ పరికరాలు మునిగి ప్రమాదకరం గా ఉంటాయి, అలాంటప్పుడు అపార్ట్మెంట్ వాసులు విద్యుత్ శాఖ వారికీ తెలియజేస్తే విద్యుత్ సరఫరా నిలిపివేస్తారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ వినియోగదారులు, ప్రజలు తగు స్వీయ భద్రతా చర్యలు పాటించాలని రఘుమా రెడ్డి కోరారు.

1. క్రిందకు వంగిన, కూలిన విద్యుత్ స్తంభాలు, విద్యుత్ వైర్ల కు దూరంగా ఉండాలి, వాటిని తాకొద్దు.

2. క్రింద పడ్డ/ వేలాడుతున్న విద్యుత్ వైర్లను తాకడం, వాటిమీద నుండి వాహనాల తో డ్రైవ్ చేయడం, వైర్లను తొక్కడం చేయరాదు.

3. చెట్ల మీద, వాహనాల మీద విద్యుత్ వైర్లు పడితే వాటిని తాకే ప్రయత్నం చేయరాదు.

4. రోడ్ల మీద నిల్వ ఉన్న నీళ్లలో విద్యుత్ వైర్లు గాని, ఇతర విద్యుత్ పరికరాలు మునిగి ఉన్నట్లయితే ఆ నీటిలోకి పోరాదు.

5. విద్యుత్ స్తంభాలకు, స్టే వైర్లకు పశువులను కట్టరాదు. వర్షం పడేటప్పుడు, తగ్గిన తరువాత పశువులను విద్యుత్ వైర్ల కు,
ట్రాన్స్ ఫార్మర్లకు దూరంగా తీసుకెళ్లాలి, ఇలాంటి పరిస్థితుల్లో చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి.

6. వర్షం కురిసేటప్పుడు విద్యుత్ లైన్లు ఉన్న చెట్ల క్రింద నిలబడటం, చెట్లు ఎక్కడం చేయరాదు.

7. విద్యుత్ కి సంబంధించి ఎలాంటి అత్యవసర పరిస్థితి వున్నా 1912 / 100 / స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్ తో పాటు విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ 7382072104, 7382072106,7382071574 నకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయగలరు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News