Friday, May 10, 2024

కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు నిరుపమానం

- Advertisement -
- Advertisement -

రవాణా శాఖ కమిషనర్ ఎం.ఆర్.ఎం.రావు

మన తెలంగాణ/హైదరాబాద్: నమ్ముకున్న బాటను విడిచి పెట్టకుండా ఆదర్శవంతైన జీవితాన్ని గడిపిన త్యాగశీలి కొండా లక్ష్మణ్ బాపూజీ అని రవాణా శాఖ కమిషనర్ ఎం.ఆర్.ఎం.రావు కీర్తించారు. జయంతిని పురస్కరించుకుని సోమవారం రవాణా శాఖ కార్యాలతయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించి ఆ మహనీయుడి త్యాగనిరతిని కొనియాడారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తెలంగాణ కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహా వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని శ్లాఘించారు. బాపూజీ సేవలు నిరుపమానమని, స్వరాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ అన్ని రంగాల్లో ముందడుగు వేయాలని ఆకాంక్షించిన మహానుభావుడు ప్రజా సేవకు ఎనలేని కృషి చేశారన్నారు.

తెలంగాణ కోసం లక్ష్మణ్ బాపూజీ తన జీవితం అంకితం చేశారని, పోరాటంలో ఉన్నా, చట్టసభల్లో ఉన్నా అనుక్షనం ప్రజా సంక్షేమం కోసం పరితపించిన మహానేత అన్నారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి తెలంగాణ ప్రజల మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు. పేద ప్రజలకు అనేక సేవలందించి, బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ జీవితాశయాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News