Sunday, June 15, 2025

ఉత్కంఠభరితంగా ట్రైలర్

- Advertisement -
- Advertisement -

నవీన్ చంద్ర హీరోగా నటించిన బైలింగ్వల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లెవెన్. సుందర్ సి వద్ద కలకలప్పు 2, వంద రాజవతాన్ వరువేన్, యాక్షన్ వంటి చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన లోకేశ్ అజల్స్ దర్శకత్వం వహించారు. ఏఆర్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అజ్మల్ ఖాన్, రేయా హరి నిర్మించిన లెవెన్, విమర్శకుల ప్రశంసలు పొందిన సిలా నేరంగలిల్ సిలా మణిధర్గల్, సెంబి చిత్రాల విజయం తర్వాత వారి మూడవ వెంచర్.

ఈ చిత్రం ఈ వేసవిలో అద్భుతమైన సినిమా ఎక్స్‌పీరియన్స్‌ని అందించడానికి సిద్ధంగా ఉంది. ఉలగనాయకన్ కమల్ హాసన్ ఈ సినిమా ట్రైలర్‌ని లాంచ్ చేశారు. ఒక మాసీవ్ ఫైర్ యాక్సిడెంట్ తో మొదలైన ట్రైలర్ అవుట్ అండ్ అవుట్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. నవీన్ చంద్ర అద్భుతమైన నటన, సీరియల్ కిల్లింగ్ బ్యాగ్‌డ్రాప్, డైరెక్టర్ లోకేశ్ అజల్స్ గ్రిప్పింగ్ టేగిప్పింగ్ ట్రైలర్‌ని నెక్స్ లెవెల్ కి తీసుకెళ్ళాయి. సిలా నేరంగలిల్ సిలా మణిధర్గల్‌లో నటించిన రేయా హరి, ఎలెవెన్‌లో కథానాయికగా నటించింది. అభిరామి, రవివర్మ, కిరీటి దామరాజు ట్రైలర్ లో కీలక పాత్రలలో ఆకట్టుకున్నారు. రుచిర ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఎన్ సుధాకర్ రెడ్డి ఈ సినిమా థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్నారు. ట్రైలర్ ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ పై అంచనాలని మరింతగా పెంచింది. మే 16న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News