Friday, September 26, 2025

గోల్డెన్ ప్రొడక్షన్స్ సినిమా ప్రారంభం

- Advertisement -
- Advertisement -

గగన్ బాబు, కశికా కపూర్ హీరో హీరోయిన్స్ గా సత్యం రాజేష్, సాయి రోనఖ్ కీలక పాత్రలలో ఎకె జంపన్న దర్శకత్వంలో గోల్డెన్ ప్రొడక్షన్స్ (Golden Productions) బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం1 గా తోట లక్ష్మీ కోటేశ్వరరావు నిర్మిస్తున్న కొత్త చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి సాహు గారపాటి క్లాప్ కొట్టారు. వివేక్ కూచిభట్ల కెమరా స్విచాన్ చేశారు. నిర్మాత తోట లక్ష్మీ కోటేశ్వరరావు, దర్శకుడు ఎ కె జంపన్నకి స్క్రిప్ట్ ఆందచేశారు. ఫస్ట్ షాట్ కు వీర శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు.

ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో పృద్వీ, మణిచందన, మహేష్ విట్టా, రంగస్థలం మహేష్ , నాగ మహేష్, ఇతర కీలక పాత్రలు (Key roles) పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. మూవీ లాంచింగ్ ఈవెంట్ లో డైరెక్టర్ జంపన్న మాట్లాడుతూ ‘ఇదొక ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్. త్వరలో షూటింగ్ మొదలు పెడతాం’ అని అన్నారు. నిర్మాత తోట లక్ష్మీ కోటేశ్వరరావు మాట్లాడుతూ ‘అద్భుతమైన స్టోరీ ఇది. దేశం అంతా మాట్లాడుకునే విధంగా వుంటుంది’ అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News