Tuesday, April 30, 2024

 గ్రూప్ 4 పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: టిఎస్‌పిఎస్‌పి గ్రూప్ 4 వ్రాత పరీక్షకు సంబంధించి జిల్లాలో మొత్తం 73 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్‌పి ఎగ్గడి భాస్కర్ తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద జూలై 1న ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 144 సెక్షన్ అమలు ఉంటుందని, పరీక్షకేంద్రాల సమీపంలో ఉన్న అన్ని జిరాక్స్ కేంద్రాలు, ఇంటర్‌నెట్ కేంద్రాలు, చుట్టు పక్కల లౌడ్ స్పీకర్లు, మూసివేయాలని తెలిపారు.

పరీక్ష కేంద్రాల వద్ద నుంచి 100 మీటర్ల వరకు ప్రజలు గుమిగూడ వద్దని, పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరుగుతుందని, అభ్యర్థులు పరీక్ష సమయాని కంటే 2 గంటల ముందే కేంద్రానికి చేరుకోవాలని, మానసికంగా ఎటువంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. జిల్లాలో మెట్‌పల్లిలో 11, కోరుట్ల 20, రాయికల్ 4, జగిత్యాల టౌన్ 27, జగిత్యాల రూరల్ 7 , మల్యాల 2, కొడిమ్యాల 1, గొల్లపల్లి 1మొత్తం 73 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
అభ్యర్థులకు సూచనలు…
పేపర్ 1ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్ 2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించబడును. అభ్యర్థులు చివరి సమయంలో వచ్చి ఇబ్బందులు పడకుండా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. పరీక్ష కేంద్రంలోకి బ్యాగులు, సెల్‌ఫోన్‌లు, స్మార్ట్ ఫోన్‌లు, వాచ్‌లు, క్యాలిక్యులేటర్ తదితర ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించరు. చెప్పులు మాత్రమే వేసుకుని రావాలి. షూ వేసుకుని పరీక్ష కేంద్రానికి రావద్దు. అభ్యర్థులను మెటల్ డిటెక్టివ్ ద్వార పరిశీలించి పరీక్ష కేంద్రంలోనికి పంపిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News