Sunday, April 28, 2024

మళ్లీ రైతుల చలో ఢిల్లీ… ఉలిక్కి పడుతున్న కేంద్రం

- Advertisement -
- Advertisement -

రైతులు మరోసారి చలో ఢిల్లీ ఆందోళనకు పిలుపు ఇవ్వడంతో కేంద్ర ప్రభుత్వం ఉలిక్కి పడుతోంది. తమ సమస్యల పరిష్కారం కోసం రైతులు ఈనెల 13న చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టాలని 200 రైతు సంఘాలు నిర్ణయించాయి. దాంతో  దేశ రాజధానిలోకి రైతులు అడుగుపెట్టకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల్లో పోలీసు బలగాలు అప్రమత్తమయ్యాయి. పంటలకు కనీస మద్దతు ధరపై రూపొందించిన చట్టాన్ని నిరసిస్తూ రైతులు 2020లో పెద్దయెత్తున ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో తమపై పెట్టిన కేసులను కొట్టివేయాలని వారు పట్టుపడుతున్నారు. అలాగే అనేక ఇతర డిమాండ్ల పరిష్కారాన్ని కూడా కోరుతూ వారు తాజాగా ఆందోళనకు పిలుపునిచ్చారు.

పోలీసులు ఇప్పటికే ప్రధాన రహదారుల్లో బారికేడ్లు, సిమెంట్ దిమ్మెలు పెట్టి రైతుల రాకపోకలను నిరోధిస్తున్నారు. హర్యానా ప్రభుత్వం చలో ఢిల్లీ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ఏడు జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. కురుక్షేత్ర, హిస్సార్, అంబాలా, ఫతేబాద్, సిస్రా, జింద్, కైతాల్ జిల్లాల్లో మొబైల్ నెట్ వర్క్ సేవలు స్తంభించిపోయాయి. అంబాలా, సోనిపట్, పంచకుల్ లో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News