Saturday, May 4, 2024

బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థి మృతిపై విచారణ జరిపించాలి : ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్.

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బాసర ట్రిపుల్ ఐటిలో పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని దీపికా పరిపాలన భవనంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనపై విచారణ జరిపించాలని ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తోంది. మంగళవారం ఆసంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్.ఎల్.మూర్తి, కార్యదర్శి టి. నాగరాజు ఒక ప్రకటనలో పేర్కొంటూ ట్రిపుల్ ఐటీ లో పూర్తిస్థాయిలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నేరవేర్చలేదని సరైన సౌకర్యాలు కల్పించలేదని ఆరోపించారు.

బాతురూమ్‌లో జారిపడి మృతిచెందిందా అనే కోణంలో అనుమానం ఉందని ఈ మృతిపై సమగ్రమైన విచారణ జరిపించాలని కోరారు. బాచుపల్లిలోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో హస్టల్ భవనంపై నుండి పడి వంశిక అనే మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్ధిని కిందపడి చనిపోయింది. పూర్తిస్థాయిలో తరగతులు ప్రారంభం కాకముందే హస్టల్‌లో విద్యార్ధులను ఉంచి తరగతులు బలవంతంగా నడుపుతున్నారని విమర్శించారు. ఒత్తిడి కారణంగా విద్యార్ధిని చనిపోయింది. తక్షణమే విచారణ జరిపించి ,యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని,లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News