Tuesday, April 30, 2024

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సోమవారం నిర్వహించిన హరితోత్సవం నిర్వహించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్, పోలీస్ కమీషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్లు, ట్రాఫిక్ పీఎస్‌లలో ఘనంగా హరితోత్సవం కార్యక్రమం జరిగింది. కమిషనరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర మొక్కను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సపోటా మొక్కను నాటారు. అడిషనల్ సీపీ (అడ్మిన్) అవినాష్ మహంతి, ట్రాఫిక్ జాయింట్ సీపీ నారాయణ్ నాయక్, డీసీపీ అడ్మిన్ యోగేశ్ గౌతమ్, విమెన్ అండ్ చైల్ సేఫ్టీ వింగ్ డీసీపీ నితికా పంత్, ఇఒడబ్లూ డీసీపీ కవిత మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ ర వీంద్ర మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, మొక్కలు నాటి పర్యావరణాన్ని సంరక్షించాలన్నారు. ‘వృక్షో రక్షతి రక్షితః’ అని పెద్దలు అన్నారని దాని యొక్క ప్రాముఖ్యత అందరూ తెలుసుకోవాలన్నా రు. గ్రీన్ కవర్ పెంచడంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, భావితరాల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని మొక్కలు నాటడం అలవాటుగా చేసుకోవాలని సూచించారు. స్వచ్ఛమైన ఆహ్లాదకరమైన వాతావరణం కోసం మొక్కలు నాటడం జరిగిందన్నారు. ప్రభుత్వం సూచించిన విధంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని తెలిపారు. నాటిన ప్రతి మొక్కను కాపాడవలసిన బా ధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు. భావితరాల వారికి స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించేందుకుగాను ప్రతి ఒక్కరు మొక్కలను నాటడం తమ వంతు బాధ్యతగా గుర్తించాల్సిన అవసరం వుందన్నారు.

ప్రతిఒక్కరూ పుట్టిన రోజు, వివాహ వార్షికోత్సవం రోజున మొక్కలను నాటడం, మొక్కలను బహుమతిగా అందజేయడం ఒక ఆనవాయితీగా మార్చుకోవాలని తెలిపారు. రాబోయే తరాలకు స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుంచి హరితహారం కార్యక్రమంలో పెద్దఎత్తున మొక్కలు నాటడం జరుగుతోందిని తెలిపారు. కమిషనరేట్‌లో 2000 మంది హరితహారంలో పాల్గొన్నారు. వీటిలో స పోటా, బత్తాయి, నేరేడు, టేరేడు, కాగితపు పూల మొ క్కలు నాటారు. కార్యక్రమంలో సైబరాబాద్ ట్రాఫిక్ జా యింట్ సీపీ నారాయణ నాయక్, డిసిపి అడ్మిన్ యోగేష్ గౌతమ్, డిసిపి షీ టీమ్స్ నితికా పంత్, మాదాపూర్ ఏడిసిపి నంద్యాల నరసింహారెడ్డి, సిఎస్ డబ్ల్యూ ఏడీసీపీ వెంకట్ రెడ్డి, ఏడీసీపీలు, ఎస్బీ ఏడీసీపీ రవి కుమార్, సిటిసి ఏడీసీపీ రామ చంద్రుడు, ఏసీపీలు, ఆర్‌ఐ లు, మినిస్ట్రీయల్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు.
మాదాపూర్ జోన్..
మాదాపూర్ జోన్ డిసిపి శ్రీమతి శిల్పవల్లి, ఏడీసీపీ ఆధ్వర్యంలోని అన్ని సబ్ డివిజన్లు, పోలీస్ స్టేషన్లలో మొక్కలు నాటరు. మాదాపూర్ జోన్ పరిధిలో మొత్తం 10,000 మొక్కలు నాటారు.
బాలానగర్ జోన్..
బాలానగర్ జోన్ డిసిపి టి శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో సబ్ డివిజన్ల ఏసిపి ఆఫీసుల్లో, పోలీస్ స్టేషన్లలో మొక్కలు నాటరు. ఈ సందర్భంగా బాలానగర్ జోన్ డిసిపి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ హరితోత్సవం కార్యక్రమంలో భాగంగా 12,000 మొక్కలను నాటామని తెలిపారు.
శంషాబాద్ జోన్..
శంషాబాద్ డిసిపి నారాయణ్ రెడ్డి ఆధ్వర్యంలోని అన్ని సబ్ డివిజన్లు, పోలీస్ స్టేషన్లలో మొక్కలు నాటారు. హరితోత్సవం కార్యక్రమంలో భాగంగా 13,000 మొక్కలను నాటారు. ఏడిసిపిలు, ఏసిపిలు, ఇన్ స్పెక్టర్లు ఉత్సాహంగా మొక్కలు నాటారు.
రాజేంద్రనగర్ జోన్…
రాజేంద్రనగర్ జోన్ డిసిపి జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలోని అన్ని సబ్ డివిజన్లు, పోలీస్ స్టేషన్లలో మొక్కలు నాటరు. హరితోత్సవం కార్యక్రమంలో భాగంగా 12, 000 మొక్కలను నాటారు. ఏడిసిపిలు, ఏసిపిలు, ఇన్‌స్పెక్టర్లు మొక్కలు నాటారు.
మేడ్చల్ జోన్..
మేడ్చల్ జోన్ డిసిపి సందీప్ ఆధ్వర్యంలో సబ్ డివిజన్లు, పోలీస్ స్టేషన్లలో మొక్కలు నాటరు. హరితోత్సవం కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ జోన్ 10,000 కు పైగా మొక్కలను నాటారు. ఎసిపిలు, ఇన్స్‌స్పెక్టర్లు మొక్కలు నాటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News