Tuesday, April 30, 2024

మూర్చ వ్యాధి ప్రాణాంతకం కాదు.. వైద్యం ద్వారా నియంత్రణ చేయవచ్చు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మూర్చ వ్యాధిపై పలు మూఢ నమ్మకాలు మన దేశంలో ప్రాచుర్యంలో ఉన్నాయని కానీ అవి పూర్తిగా అవగాహనలోపంతో ఏర్పడ్డాయని ఆస్టర్ ప్రైమ్ ఆసుపత్రి వైద్యులు డా. అనిరుద్ కుమార్ పురోహిత్ పేర్కొన్నారు. ఆదివారం మూర్చ వ్యాధిపై అవగాహన కార్యక్రమాలు చేపట్టి, కృష్ణకాంత్ పార్కు వద్ద ఉచిత స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించి పలువురికి పరీక్షలు చేశారు.

ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మూర్చ వ్యాధి అనేది చిన్న వయస్సుల వారికి వచ్చే అవకాశముందని, అందుకు ప్రధానంగా మనిషి మెదడులో ఏర్పడే లోపాలు, రుగ్మతలే కారణమన్నారు. ఇలా మెదడులో లోపం ఏర్పడానికి ట్యూమర్‌లు, వైరస్‌ల ద్వారా వచ్చే ఇన్పెక్షన్, మెదడుకు గాయాలు తగులడంతో పాటు ఇతరత్రా జీవనశైలి వ్యాధుల కారణంగా ఏర్పడే ఒత్తిడితో ఏర్పడే నరాల క్షీణత, బ్రెయిన్ స్ట్రోక్‌లాంటి కారణలుంటాయని వివరించారు.

ఇలాంటి కారణాలచే మనిషి మెదడులో ఉన్నట్టుండి ఏర్పడే అసాధారణ కంపనాల కారణంగా ఈమూర్చ వస్తుందని తెలిపారు. మూర్చ వచ్చినప్పుడు మనిషి అవయవాలలో తీవ్రమైన కదలికలు రావడం, అవయవాలు కొట్టుకోవడం, ముఖం ఒక వైపు తిరిగి బిగుసుకపోవడం లాంటి గమనించవచ్చన్నారు. ఉచిత వైద్య శిబిరంలో 150మందికిపైగా రోగులకు పరీక్షలు నిర్వహించినట్లు ఈకార్యక్రమంలో ఆసుపత్రి ఇతర వైద్యులు, నర్సింగ్, పారామెడికల్ సిబ్బందితో పాటు వాకర్స్ అసిసోయేషన్ చెందిన సభ్యులు,వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News