Thursday, May 2, 2024

త్వరలోనే తెలంగాణలో ఉచిత విద్య, వైద్యం: ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

Minister Errabelli Dayakar Rao Tested Corona Positive

పాలకుర్తి: ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిపారని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కెసిఆర్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా పాలకుర్తి ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు, బ్రెడ్ లను మంత్రి ఎర్రబెల్లి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ..  ”రాష్ట్రంలో ప్రతి పౌరుడు అందరూ బాగుపడ్డారు. పల్లెలు స్వయం సమృద్ధిగా ఎదిగాయి. రాష్ట్రంలో జనగామ జిల్లా, జిల్లాలో పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధిలో అగ్రగామిగా ఉంది. రాబోయే రోజుల్లో మార్చి తర్వాత తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచిత విద్య, వైద్యం చేపట్టాలని సీఎం కెసిఆర్ ఆలోచిస్తున్నారు. దళిత బంధు పథకానికి రూ.20వేల కోట్లు పెట్టి, ప్రతి దళిత బిడ్డను ఆదుకోవాలని సీఎం నిర్ణయించారు. సీఎం కెసిఆర్ తెలంగాణ గాంధీ. గాంధీజీ గ్రామ స్వరాజ్యాన్ని ఆదర్శంగా చెప్పారు. ఆయన చెప్పిన ఆదర్శాన్ని సీఎం కెసిఆర్ ఆచరణలో పెట్టారు. దేశంలో 70 ఏళ్లుగా గ్రామాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. సీఎం కెసిఆర్ వచ్చాక గ్రామాలన్నీ పచ్చగా నిండుగా విలసిల్లుతున్నవి. స్వయం సమృద్ధిగా అవుతున్నాయి. అందుకే సీఎం కెసిఆర్ జన్మ దినోత్సవం ఘనంగా నిర్వహించాలి. రాష్ట్ర వ్యాప్తంగా పేదలు, దివ్యాంగులకు, రోగులకు అన్నదానం, పండ్లు పంపిణీ చేయాలి. రక్తదాన కార్యక్రమం నిర్వహించాలి. 17న మొక్కలు నాటడం. సర్వమత ప్రార్థనలు చేయాలి. సీఎం కెసిఆర్, ఆయన కుటుంబం చల్లగా ఉండాలి. ఆయన వల్ల తెలంగాణ రాష్ట్రం బాగు పడింది.

రాష్ట్రంలో నెంబర్ వన్ నియోజకవర్గంగా పాలకుర్తి ఏర్పాటు కానుంది. తెలంగాణ వచ్చాక ఏం వస్తది? అన్నోల్లకు సీఎం కెసిఆర్ అభివృద్ధి కార్యక్రమాలే నిదర్శనం. మొన్నటి జనగామ సభలో సీఎం కెసిఆర్ పాలకుర్తి నియోజకవర్గంపై వరాలు కురిపించారు. పాలకుర్తి, తొర్రూరు హాస్పిటల్ లను 100 పడకల హాస్పిటల్స్ ను ఏర్పాటు చేయనున్నాం. కొడకండ్ల, రాయపర్తి, దేవరుప్పుల హాస్పిటల్స్ ను గా అప్ గ్రేడ్ చేయనున్నాం. పెద్ద వంగరలో కొత్త హాస్పిటల్ ను ఏర్పాటు చేయనున్నాం. కొడకండ్లలో కొత్తగా టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేయాలని సీఎంని కోరాను. ఆయన సానుకూలంగా స్పందించారు. సన్నూరు దేవాలయం ఆధునీకరణకు సీఎం కెసిఆర్ అంగీకరించారు. పాలకుర్తి నియోజకవర్గంలోని అన్ని రిజర్వాయర్లు త్వరలోనే పూర్తి చేస్తాం. జనగామ కు మెడికల్ కాలేజ్ ఇస్తామని సీఎం కెసిఆర్ ప్రకటించారు. స్టేషన్ ఘనపూర్ లో డిగ్రీ కాలేజ్, పాలకుర్తిలో జూనియర్, డిగ్రీ కాలేజ్ కు అనుమతులు ఇప్పిస్తామని సీఎం చెప్పారు. ఇంతగా చేసిన సీఎం కెసిఆర్ కి కృతజ్ఞతలు.. ధన్యవాదాలు. అలాగే మొన్న సీఎం కెసిఆర్ జనగామ సభను విజయవంతం చేసిన ప్రజలకు కృతజ్ఞతలు” అని పేర్కొన్నారు.

Errabelli Dayakar Rao visit Palakurthi Govt Hospital

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News