Thursday, May 2, 2024

ఆస్ట్రేలియా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుండడంతో ఆయా దేశాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ జాగృతి ఆస్ట్రేలియా శాఖ నిత్యావసర సరుకులను పంపిణీ చేసేందుకు ముందుకు వచ్చింది. ఆస్ట్రేలియాలో చిక్కుకున్న అంతర్జాతీయ విద్యార్థులకు తెలంగాణ జాగృతి నిత్యావసర సరుకులను పంపిణీ చేసింది. ఈ సరుకులు కొద్ది వారాల పాటు విద్యార్థులకు ఉపయోగపడనున్నాయి. ఎవరికైనా సాయం కావాలనుకుంటే 040 6969095 నెంబర్‌కు కాల్ చేయాలని తెలంగాణ జాగృతి ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు శ్రీకర్ రెడ్డి అందేం, సభ్యుడు నిఖిల్ రెడ్డి కోరారు. కరోనా వైరస్‌ను తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని వారు పిలుపునిచ్చారు.

Essential Goods Distributed under Aus Telangana Jagruthi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News