Wednesday, May 1, 2024

ఆర్టీసి ఉద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్నారుః ఈటల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆర్టీసి ఉద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్నారని బిజెపి ఎమ్మెల్యే పేర్కొన్నారు. శనివారం ఉదయం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. “ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయడాన్ని స్వాగతిస్తున్నాం. ఆర్టీసి విలీనం బిజెపికి ఇష్టం లేదని ప్రచారం జరుగుతోంది.టిఆర్‌ఎస్ ప్రభుత్వం కావాలని బట్టకాల్చి గవర్నర్ మీద వేస్తున్నారు.ఆర్టీసి ఉద్యోగులను తప్పుదోవ పట్టిస్తూ, బలవంతంగా రాజ్‌భవన్‌కు పంపుతున్నారు.ఆర్టీసి ఉద్యోగులకు రెండు పిఆర్సీలు బకాలు ఉన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది” అని విమర్శించారు.

కాగా, తెలంగాణ సర్కార్, ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేస్తూ గవర్నర్ అమోదం కోసం బిల్లును పంపించింది. అయితే, గవర్నర్ అందుబాటులో లేకపోవడంతోపాటు ప్రభుత్వాన్ని రాజ్‌భవన్ వర్గాలు న్యాయ వివరణ కోరుతూ.. బిల్లును పక్కన పెట్టింది. దీంతో ఆర్టీసి యూనియన్, గవర్నర్ బిల్లును అమోదించాలని డిమాండ్ చేస్తూ రాజ్‌భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News