Saturday, May 4, 2024

కేంద్రం సహకరించకున్నా.. ప్రగతిపథంలో రాష్ట్రం : ముఠా గోపాల్

- Advertisement -
- Advertisement -

ముషీరాబాద్ ః కేంద్రంలోని మోడీ సర్కార్ సహకరించకపోయినా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతోందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నాటి ఉమ్మడి పాలకులు చేసిన విమర్శలన్నీ పచ్చి అబద్దాలని రుజువ య్యాయని అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా ముగిసిన సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ముందు చూపు కారణంగా మంచినీటి, సాగునీటికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చేశారన్నారు.

ముషీరాబాద్ నియోజకవర్గం భోలక్‌పూర్‌లో రూ. 25 కోట్లతో మంచినీటి, డ్రైనేజీ పైప్‌లైన్లను నిర్మించి శాశ్వతంగా నీటి సమస్యను పరిష్కరించి నట్టు తెలిపారు. నియోజకవర్గంలోని పేద విద్యార్థులకు ప్రభుత్వ డిగ్రీ, పిజి కళాశాల భవన నిర్మాణం, ఆసుపత్రి నిర్మాణాలు జరుగుతున్నట్టు చెప్పారు. రూ. 426 కోట్లతో స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తవుతున్నట్టు తెలిపారు. ముషీరాబాద్ డివిజన్‌లో 40 ఏళ్లుగా ఉన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించామని అన్నారు. ముషీరాబాద్ నియోజక వర్గంలో దశాబ్ది ఉత్సవాలలో భాగస్వామి అయిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. విలేకరుల సమావేశంలో బిఆర్‌ఎస్ రాష్ట్ర యువ జన నాయకులు ముఠా జైసింహ, సీనియర్ నాయకులు ముచ్చకుర్తి ప్రభాకర్, వివిధ డివిజన్ల అధ్యక్షులు రావులపాటి మోజస్, వల్లాల శ్యామ్ యాదవ్, రాకేష్ కుమార్ బల్ల శ్రీనివాస్ రెడ్డి, నర్సింగ్ ప్రసాద్, నాయకులు ఎర్రం శ్రీనివాస్ గుప్తా, వల్లాల శ్రీనివాస్, శంకర్ ముదిరాజ్, సాయి, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News