Thursday, May 2, 2024

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి

- Advertisement -
- Advertisement -
  • జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

ములుగు జిల్లా ప్రతినిధి: 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని, సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రోరల్ పార్టిసిపేషన్ (ఎస్‌విఇఇపి) ప్రోగ్రామ్ కింద పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాబోయే ఎన్నికల సందర్భంగా సంబంధిత ఈఆర్‌ఓ, ఏఈఆర్‌ఓస్, బిఎల్‌ఓ సూపర్వైజర్లతో ఎస్‌విఇఇపి ప్రోగ్రాం పై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్ నమోదు పై అవగాహన కల్పించాలని, అదేవిధంగా ఓటు వేయడానికి ప్రేరేపించేలా చేయాలని, ఈవీఎంలపై నైతిక విలువలతో ఓటింగ్‌పై అవగాహన కార్యక్రమాలు ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని అన్నారు. ఎస్‌ఎస్‌ఆర్ 02 ఆగస్టు 21 నుండి ప్రారంభం అవుతుందని జిల్లాలో ఉన్న విద్యా సంస్థలలో ప్రత్యేక ఎలక్ట్రోరల్ క్లబ్‌లు ఏర్పాటు చేయాలని. ఓటరు ప్రాముఖ్యత పై విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు. 01 అక్టోబర్ 2023 నాటికి యువత ఎవరైతే 18 సంవత్సరాలు నిండి ఉన్నారో వారికి ఓటు హక్కు కల్పించే విధంగా కాలేజి వారిని లిస్టు ప్రిపేర్ చేసుకుని వారు చదువుకునే కళాశాలలోనే ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకునేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.

క్షేత్రస్థాయిలో పంచాయితీ సెక్రటరీ, బూత్ లెవల్ అధికారులు, విలేజ్ ఆర్గనైజేషన్ మహిళలు సమన్వయంగా పనిచేస్తే ఎన్నికలకు సంబంధించిన అన్ని పనులు పూర్తి చేయవచ్చని అన్నారు. నూతన ఓటరు నమోదు అంశంలో లింగ నిష్పత్తి తక్కువ కాకుండా ప్రత్యేక శ్రద్ధ వహించి నూతన మహిళ ఓటర్ల నమోదు విస్తృతంగా జరిగేలా చూడాలని అన్నారు. ట్రాన్స్ జెండర్ ఓటర్లపై దృష్టి పెట్టాలన్నారు. అర్హత గల ప్రతి ఒక్క ఓటర్‌ను ఎన్రోల్మెంట్ చేయాలన్నారు.

పిల్లలకు మాక్ పార్లమెంట్ నిర్వహించాలని, ఎతికల్ ఓటింగ్ గురించి అవగాహన కల్పించాలని ఈవీఎం ద్వారా ఓటు హక్కు నమోదు గురించి కూడా తెలియపరచాలని అన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీస్తున్న నేపథ్యంలో అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఓటరు టర్న్ ఔట్ పెరిగే దిశగా అవగాహన కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలని, ప్రజలలోకి ఎన్నికల కమీషన్ సందేశం విస్తృతంగా వెళ్లే విధంగా వినూత్న రీతిలో ప్రచారం చేయాలని అన్నారు. జిల్లాలో చదువుకున్న విద్యార్ధుల జాబితా ఆగస్టు 19 లోపు అందించాలని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించే దిశగా పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది టీచర్లు ఓటర్లుగా నమోదు చేసుకున్నారో లేదో పరిశీలించాలని, ఓటరుగా నమోదు చేసుకోని పక్షంలో వెంటనే నమోదు చేసి ఓటర్ ఐడి కార్డులు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆగస్టు 19న ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో ఉదయం ఓటర్ ప్రాముఖ్యతను వివరిస్తూ ఐ ఓటర్ ఫర్ షూర్ అనే నినాదానికి ప్రచారం కల్పిస్తూ 5కే రన్ నిర్వహించాలని, 5కే రన్ లో పాల్గొనేందుకు సమీప గ్రామాల నుంచి యువత వచ్చే విధంగా ప్రోత్సహించాలని పేర్కొన్నారు.

అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఓటరు టర్న్ ఔట్ పెంచేందుకు అనుసరించే వ్యూహం, చేప్టటే కార్యక్రమాలపై నివేధిక సమర్పించాలని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం కల్పించాలని, గ్రామీణ ప్రాంతాలోల స్థానిక పరిస్థితులకనుగుణంగా ప్రచారం చేపట్టాలని అన్నారు. రెండవ విడత ఓటర్ జాబితా సవరణలో భాగంగా డ్రాప్ట్ ఓటరు జాబితా విడుదల కంటే ముందు రాజకీయ పార్టీల ప్రతినిదులతో సమావేశం నిర్వహించాలని, రెండవ ఓటరు సవరణ షెడ్యూల్ పై సమాచారం అందించాలని, ఆగస్టు 21న విడుదల చేస్తామని, సెప్టెంబర్ 19 లోపు అభ్యంతరాలు, నూతన ఓటరు నమోదు దరఖాస్తులు స్వీకరించడం జరగుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ డి వేణు గోపాల్, ఆర్డీఓ సత్యపాల్ రెడ్డి, డిపిఓ వెంకయ్య, జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత, డిపిఆర్‌ఓ రఫిక్, తహసిల్దార్‌లు విజయ భాస్కర్, ఖాజా మొయినోద్ధీన్, వీరాస్వామి, రమాదేవి, కలెక్టరేట్ ఎన్నికల సూపరింటెండెంట్ మజర్ అలీ, డిటీ విజయ్ కుమార్, అనీజ్ ఫాతిమా, బిఎల్‌ఓలు, సూపర్‌వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News