Thursday, May 2, 2024

18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోండి

- Advertisement -
- Advertisement -

Everyone over the age of 18 must register to vote

మన తెలంగాణ/సిటీ బ్యూరో: హైదరాబాద్ జిల్లా పరిధిలో జనవరి 1, 2022 నాటికి 18 సంవత్సారాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్‌ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ పిలుపునిచ్చారు. 2022 సంవత్సరానికి సంబంధించి భారత ఎన్నికల సంఘం ప్రత్యేక ఓటరు జాబితా సవరణను విడుదల చేసిన నేపథ్యంలో ఓటరు జాబితా ఏలాంటి అభ్యంతరాలు ఉన్నా ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్న ప్రత్యేక క్యాంపెయిన్ ఫిర్యాదులు, విజ్ఞప్తులు చేయవచ్చాన్నారు. ఇందుకు సంబంధించి బూత్ స్థాయి అధికారులు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ బూత్ తో అందుబాటులో ఉంటారన్నారు.

ఓటరు జాబితాలో తప్పుగా ఉన్న పేరు, అడ్రస్ ఇతర ఏవైనా అభ్యంతరాలు ఉన్న పక్షంలో సవరణ చేసుకునే వెసులుబాటు ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి వివరించారు. బుధవారం కమిషనర్ స్వీప్ కమిటీ సభ్యులతో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ పై వర్చువల్ మీటింగ్ జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటరు నమోదు పేర్లు, అడ్రస్ ఒక నియోజక వర్గం నుండి మరొక నియోజకవర్గానికి మార్పు కోసం సంబంధిత ఇ.అర్.ఓ లకు, గానీ www.nvsp.in, లేదా ఓటరు నమోదు యాప్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చన్నారు. నూతన ఓటరు నమోదుకు ఫారం-6, ఓటరు జాబితా నుండి పేరు తొలగింపు కోసం ఫారం-7, ఓటరు జాబితా లో తప్పుల సవరణకు ఫారం-8, అదే నియోజకవర్గంలో అడ్రస్ మార్పుకు ఫారం-8A వినియోగంచుకోవాలన్నారు..సభ్యులు సూచించిన సలహాలు సూచనలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. నియోజక వర్గంలో ఓటురు నమోదు అభ్యంతరాలు సరిచేసుకొనేవిధంగా ఆడియో ద్వారా తెలుగు, ఇంగ్లీష్ ఉర్దూ భాషలో ప్రచారం చేస్తున్నట్లు మొబైల్ యస్.ఏం.యస్ ద్వారా, బస్ షెల్టర్ హోల్డింగ్ ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు దేవాలయాల్లో, మసీద్, చర్చిలలో ప్రార్థన సమయంలో అనౌన్స్ చేయించడమే కాకుండా అవగాహన కోసం కరపత్రాల పంపిణీ చేస్తున్నమన్నారు.

అదేవిధంగా పోలీస్ పీస్ కమిటీ సభ్యుల కు , అపార్ట్ మెంట్, కాలనీ కమిటీల సభ్యులకు సైతం అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. వీటితో పాటు సోషల్ మీడియా , ట్విట్టర్, ఫేస్ బుక్, వాట్స్ అప్ తో పాటుగా రేడియో, టి విల ద్వారా అంతేకాకుండా కాలేజ్, పాఠశాలల్లో కూడా అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించి ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకునేలా కృషిచేస్తామని వెల్లడించారు.ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ పంకజ, సి.పి.అర్.ఓ మహమ్మద్ ముర్తుజా, సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ k.వెంకట రమణ, సీనియర్ జర్నలిస్ట్ బచ్చన్ సింగ్, మీడియా కమ్యూనికేషన్ పి.ఐ.బి డిప్యూటీ డైరెక్టర్ వి.గాయత్రి, హైదరాబాద్ నెహ్రూ యువకేంద్రం కో-ఆర్డనేటర్ కుమారి ఖుష్బూ గుప్త, ఆల్ ఇండియా రేడియో ప్రోగ్రామ్ కో-ఆర్డనేటర్ లక్ష్మి, బేగంపేట్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల యన్.యస్.యస్ కో-ఆర్డినేటర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News