Tuesday, April 30, 2024

ప్రతి ఒక్కరూ 10 మొక్కలు నాటాలనే సంకల్పం తీసుకోవాలి

- Advertisement -
- Advertisement -

వనపర్తి ప్రతినిధి : స్వచ్ఛమైన గాలి, నీరు ఆహారాన్ని అందించే వృక్షాలను సంరక్షించుకోవడం ప్రతి ఒకరి బాధ్యత అని ప్రతి సీజన్లో ప్రతి ఒక్కరూ 10 మొక్కలు నాటాలనే సంకల్పాన్ని తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ జిల్లా ప్రలజకు పిలుపునిచ్చారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం ఐ.డి.ఒ.సి వెనక ప్రాంతంలో అటవీశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేయగా కలెక్టర్ మొక్కలు నాటి అందరిలో స్ఫూర్తిని నింపారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆక్సిజన్ లేకుండా మూడు నిమిషాల కన్నా ఎక్కువగా జీవించలేమని పది సంవత్సరాల వయసు గల వృక్షాలు ఆక్సిజన్ అందిస్తాయని తెలిపారు. మంచి ఆక్సిజన్ కొరకు పది సంవత్సరాల ముందు నుంచే మొక్కలు నాటాల్సిన అవసరాన్ని గుర్తించాలని సూచించారు. నీరు లేకుండా రెండు రోజులు కూడా జీవించమని సంవత్సరంలో కేవలం రెండు మూడు నెలల పాటు కురిసే వర్షాల కోసం మొక్కలు పెంచడం ఎంత అవసరమో అవగాహన ఉండాలని అన్నారు.

ఆహారం లేకుండా రెండు మూడు రోజులు కూడా జీవించలేని మానవుడికి మూడు నుంచి ఆరు నెలలు పంటలు పండితే కానీ ఆహార ధాన్యాలు లభ్యం కావనే విషయం మర్చిపోరాదని వివరించారు. సకల ప్రాణ కోటి జీవించటానికి అవసరమైన గాలి, నీరు, ఆహారం, మంచి వాతావరణం లభించటానికి ఎంతో ముందు జాగ్రత్తగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతుందని దానికి చిత్తశుద్ధితో ప్రతి ఒక్కరు కృషి చేయాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ సూచించారు.

కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోగా మన జిల్లాలో రెండు లక్షల నాలుగు వేల మొక్కలు నాటాడానికి లక్ష్మంగా పెట్టుకున్నామని తెలిపారు. జిల్లాకేంద్రంతో పాటు గ్రామీణ ప్రాంతాలలో మునిసిపాలిటీ గ్రామపంచాయతీలలో నేడు లక్షల మేరకు మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రతి గ్రామంలో వెయ్యి మొక్కలను నాటడం జరుగుతుందన్నారు.

హరితహారం పథకంలో మొక్కలు నాటడం నీరు పెట్టి ఎరువులు వేసి కాపాడటం ముఖ్యమని ఈ మేరకు కార్యాచరణ అమలు చేస్తున్నామని కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు ఆహుతులకు అటవీశాఖ తరపున వివిధ రకాల పండ్లను అందించారు. ఈ పండ్లు ఉత్పత్తి కావడానికి పట్టే సమయం ఎంత ఆహారంగా తీసుకునే సమయం ఎంత అంటూ జిల్లా కలెక్టర్ విద్యార్థులను ప్రశ్నించారు.

కాబట్టి మొక్కల పెంపకం ఎంత అవసరమెంతో విద్యార్థులు గమనించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అటవీ శాఖ అధికారి నవీన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రకృతి పరిరక్షణకు అడవుల పెంపకం ఎంతో ముఖ్యమైనదని వాటిని పెంపొందించే కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులలో క్రమశిక్షణతో పాటు ఉన్నత విలువలు పెంపొందించుకోవడానికి జిల్లా కలెక్టర్ చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చక్కని వాతావరణం కల్పించడంలో జిల్లా కలెక్టర్ కృతజ్ఞతుడయ్యాడని అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా అటవీ శాఖ అధికారి నవీన్ కుమార్ ,డిఆర్‌డిఓ నరసింహులు ,డిపిఓ సురేష్ , అదనపు జిల్లా కలెక్టర్ ఎస్ తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News