Sunday, April 28, 2024

సర్వం సిద్ధం

- Advertisement -
- Advertisement -

ఢిల్లీలో నేడు, రేపు జి20 శిఖరాగ్ర సదస్సు

హస్తినకు చేరిన అగ్రదేశాల అధినేతలు

అమెరికా అధ్యక్షుడు బైడెన్, బ్రిటన్ ప్రధాని సునాక్ రాక

జర్మనీ ఛాన్సలర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు, జపాన్ ప్రధాని సహా 40దేశాల అధినేతలు హాజరు, పుతిన్, జిన్‌పింగ్ డుమ్మా
ఢిల్లీ డిక్లరేషన్‌పై తొలగని అనిశ్చితి

ఉక్రెయిన్ యుద్ధం ప్రస్తావనను వ్యతిరేకిస్తున్న రష్యా, చైనా

ఆఫ్రికా యూనియన్ చేరికకు అంగీకారం
తొలిసారి జి20 సమ్మిట్‌ను నిర్వహిస్తున్న భారత్

భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జి20 సదస్సుకు ఢిల్లీ ముస్తాబైంది. ఉక్రెయిన్ యుద్ధం, కలవర పెడుతున్న అంతర్జాతీయం ఆర్థిక పరిస్థితులు వంటి చిక్కుముడుల నేపథ్యంలో సంక్లిష్ట, భౌగోళిక రాజకీయ వాతావరణం మధ్య జరుగుతున్న ఈ సదస్సు అనేక సమస్యలకు పరిష్కారాలను చూపిస్తోందని ప్రపంచం ఎదురుచూస్తున్నది. అయితే ఢిల్లీ డిక్లరేషన్ దగ్గరే పీటముడి పడింది. ఉక్రెయిన్ యుద్ధం కంట్లో నలుసుగా అవతరించింది. అయినా డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం సాధించగలమని ఇండియా ఆశాభావంతో ఉన్నది.

న్యూఢిల్లీ: భారత్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జి20 శిఖరాగ్ర సదస్సు ప్రారంభానికి సర్వం సిద్ధమయింది. ఆఫ్రికా దేశాలకు సభ్యత్వం కలిపంచ డం, ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు, ఆందోళనకరంగా ఉన్న అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు లాంటి చిక్కుముడులు నెలకొన్న సంక్లిష్ట భౌగోళిక రాజకీయ వాతావరణం మధ్య ఈ సదస్సు జరుగుతుండడం గమనార్హం. ఈ సదస్సు కోసం భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జ ర్మనీ చాన్సలర్ ఒలాఫ్ షోల్జ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇ మ్మాన్యుయేల్ మేక్రాన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌తో పాటుగా ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్, ఆర్గనైజెషన్ ఫర్ ఎకనామిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్(ఒఇసిడి) లాంటి పలు అంతర్జాతీయ సంస్థ ల అధిపతులు ఢిల్లీలో ఒక చోట సమావేశమవుతుండడంతో ఈ సదస్సుకు ఎంతో ప్రాధాన్యత లభించింది. భారత్ జి20 సదస్సుకు ఆతిథ్యం ఇవ్వడం ఇది మొదటిసారి కావడంతో దీన్ని విజయవంతం చేయడం ద్వారా అంతర్జాతీయంగా తన ప్రతిష్ఠను ఇనుమడింప జేసుకోవడానికి ప్రభుత్వం అన్ని విధా లా కృషి చేస్తోంది. సదస్సు కోసం వస్తున్న అతిథులకు కనీవినీ ఎరుగని రీతిలో అతిథ్యం కల్పించడం మొదలుకొని, ఢిల్లీ నగరాన్ని సైతం అత్యంత సుందరంగా తీర్చి దిద్దారు.

అన్నీ ఎలా ఉన్నా సదస్సులో సంయుక్త ్రప్రకటన ఉంటుందా లేదా అనేదే పెద్ద ప్రశ్న. ఇప్పటివరకు ఏ జి20 సదస్సు కూడా జాయింట్ డిక్లరేషన్ లేకుం డా ముగియలేదు. ఈ నేపథ్యంలో భారత అధికారులు సభ్య దేశాల మధ్య నెలకొన్న అభిప్రాయ భేదాలను తొలగించడానికి కృషి చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం సదస్సు ముగిసే సమయానికి ఒక అవగాహనకు వస్తారని భారత్ భావిస్తోంది. ముఖ్యంగా ఢిల్లీ డిక్లరేషన్‌కు సంబంధించిన రెండు నేరాల్లోని భౌగోళిక రాజకీయ అంశాలపైనే చిక్కుముడులున్నా యి.ఈ పేరాల్లో ఒకటి గత ఏడాది బాలి జి20 సద స్సు డాక్యుమెంట్‌లో ఉంచారు. కానీ ఈ సారి మా త్రం రష్యా, చైనాలు దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్య క్తం చేస్తున్నాయి. ఇక ప్రధాన గొడవ అంతా కూడా పేరా నంబర్ 6పైనే జరుగుతోంది. ఉక్రెయిన్‌పై ర ష్యా చేపట్టిన యుద్ధాన్ని ఖండిస్తూ ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ప్రస్తావించాలని ఒక వర్గం పట్టుబట్టగా మరో వర్గం దీన్ని వ్యతిరేకిస్తోంది.

ఆఫ్రికన్ యూనియన్‌కు సభ్యత్వం?
ఇక ఢిల్లీ సదస్సులో అన్నిటికన్నా ముఖ్యమైన అం శం జి20లో ఆఫ్రికా యూనియన్‌కు సభ్యత్వం కల్పించాలన్న ప్రతిపాదనకు దాదాపుగా అన్ని సభ్య దేశాలు ఆమోదం తెలపడం. దీనిపై దాదాపుగా ఏకాభిప్రాయం కుదిరినట్లు సమాచారం. గ్లోబల్ సౌత్‌గా పిలవబడే అభివృద్ధి చెందుతున్న దేశాలు, ముఖ్యంగా ఆఫ్రికా దేశాల ఆశలు, ఆకాంక్షలు, ఆ దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్ల గురించి గత కొన్ని సంవత్సరాలుగా భారత దేశందాదాఉగా అన్ని అంతర్జాతీయ వేదికలపైన ప్రధానంగా ప్రస్తావిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. కాకపోతే 55 దేశాలకు సభ్యత్వం ఉన్న ఆఫ్రికా యూనియన్ జి20లో చేరిన తర్వాత ఈ కూటమి పేరును జి21గా మారుస్తారా లేదా అన్నది మాత్రం తెలియరావడం లేదు. తాజాగా దీనిపై ప్రకటన వెలువడితే మాత్రం జి20లో పేద దేశాలకు ప్రాతినిధ్యం లభించినట్లవుతుంది. అంతేకాకుండా భారత్ అధ్యక్షతన ఈ గ్రూపుపై చెరగని ముద్ర వేసినట్లవుతుంది. అయితే రష్యా, చైనా సహా అన్ని దేశాలు ఎవరికి వారే ఇది తమ ఘనతేనని చెప్పుకునే ప్రయత్నం చేస్తుండడం గమనార్హం.

గాంధీజీ మిషన్‌ను అనుకరిద్దాం: మోడీ ట్వీట్లు
కాగా భారత్ అధ్యక్షతన జరిగే జి20 సదస్సు మానవ ప్రయోజనాలు, సమ్మిళిత అభివృద్ధికి కొత్త మార్గాన్ని నిర్దేశిస్తుందన్న ఆశాభావాన్ని సందర్భంగా ప్రధాని మోడీ వ్యక్తం చేశారు. శని, ఆదివారాల్లో ఢిల్లీ వేదికగా జి20 శిఖరాగ్ర సదస్సు జరుగుతున్న వేళ ప్రధాని ట్విట్టర్ వేదికగా స్పందించారు. భారత్ ఆతిథ్యాన్ని ప్రపంచ నేతలు ఆస్వాదిస్తారన్నారు. ఈ రెండు రోజుల్లో ప్రపంచ నేతల మధ్య చర్చలు ఫలప్రదం కావాలని ఆకాంక్షించారు. ‘ ఈ జి20 సదస్సులో భారత్ నినాదం వసుధైక కుటుంబం.. ఒకే పుడమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు. యావత్ ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా భావిద్దాం. పేద దేశాల అభివృద్ధికి గళమెత్తుదాం. నిరుపేదలకు, అట్టడుగు వర్గాల వారికి సేవ చేయాలనే , చిట్ట చివరి వ్యక్తికీ అభివృద్ధి ఫలాలు అందాలనే గాంధీజీ మిషన్‌ను అనుకరించడం చాలా ముఖ్యం. లింగ సమానత్వం, మహిళా సాధికారత, ప్రపంచ శాంతికోసం కలిసి పనిచేద్దాం’ అని ప్రధాని తన ట్వీట్లలో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News