Monday, April 29, 2024

స్ట్రాంగ్ రూమ్ కు ఈవీఎం లను తరలించని అధికారులు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని పలు పోలింగ్ స్టేషన్ల నుండి స్ట్రాంగ్ రూమ్ కు ఈవీఎం లను  అధికారులు తరలించలేదు. ఎన్నికల అధికారులు ఉద్దేశ పూర్వకంగానే ఈవీఎంలను తరలించడం లేదని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపణలు చేస్తున్నారు. మండలాల్లోని చాలా పోలింగ్ స్టేషన్ వద్ద సెంట్రల్ ఫోర్స్ భద్రత కనిపించలేదని కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెన్నూరు నియోజకవర్గం భీమారం మండల కేంద్రంలో బాల్క సుమన్ అనుచరులు

తెరాసా నాయకులకు సంబంధించిన తెలియని నంబర్ ప్లేటు లేని వాహనాలు పోలింగ్ కేంద్రాల్లోకి వచ్చినప్పటికీ పోలీసులు అడ్డుకొలేదని ఎస్సై వారికి పూర్తిగా సహకరించారని ఏ విధంగా పోలింగ్ కేంద్రంలోకి అనుమతిస్తారని బూత్ ఏజెంట్ లు పోలీసులను అడగటం జరిగింది. చెన్నూరు నియోజకవర్గంలో ఇప్పటికీ ఇంకా ఈవీఎంలను ఎందుకు తరలించడం లేదని అధికారులను ప్రశ్నించారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వివేక్ వెంకటస్వామి మరియు కాంగ్రెస్ కార్యకర్తలు. కార్యకర్తలకు పోలీసులకు మధ్య స్వల్ప ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News