Thursday, May 2, 2024

చిన్నారిపై హత్యాచారం కేసులో ఉరిశిక్ష

- Advertisement -
- Advertisement -

 Rape case

 

హైదరాబాద్ ః తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం రేపిన ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం కేసులో చిత్తూరు కోర్టు సంచలన తీర్పును సోమవారం వెలువరించింది. సదరు చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డ కామాంధుడు మహమ్మద్ రఫీ(27)కి ఉరిశిక్ష విధించింది. తీర్పును హైకోర్టుకు పంపుతామన్న న్యాయమూర్తి ఉరిశిక్ష తేదీని హైకోర్టు నిర్ణయిస్తుందని వెల్లడించారు. చిత్తూరు జిల్లాలో పోక్సో యాక్ట్ కింద అమలైన తొలి ఉరిశిక్ష ఇదే కావడం గమనార్హం. కేసు విచారణలో భాగంగా 41 మంది సాక్షుల వాంగ్మూలాలను కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టారు. ఆరేళ్ల చిన్నారి హత్యాచారం కేసును పోలీసులు సవాల్‌గా తీసుకున్నారు. కేవలం 17 రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేయగా.. 100 రోజుల్లో విచారణ పూర్తయ్యింది. ఎఫ్‌ఎస్‌ఎల్ కూడా పది రోజుల్లో నివేదిక అందజేసిందని పేర్కొన్నారు.

గతేడాది నవంబర్ 7న చిత్తూరు జిల్లా కురబలకోట మండలం చేనేతనగర్‌లో తన తల్లిద్రండులతో కలిసి పెళ్లికి వచ్చిన చిన్నారిని మదనపల్లి మండలానికి చెందిన మహమ్మద్ రఫీ అత్యాచారం చేసి ఆపై హతమర్చాడు. చిన్నారికి మాయమాటలు చెప్పి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టాడు. సిసి పుటేజ్ ఆధారంగా పోలీసులు మహ్మద్ రఫీ ఈ దారుణానికి ఒడిగట్టునట్లు పోలీసులు గుర్తించారు. ఘటనానంతరం నిందితుడు రఫీ ఛత్తీస్‌గఢ్ పారిపోయాడు. చిన్నారిపై హత్యాచారం ఘటనపై మహిళా సంఘాలు, ప్రజా సంఘాల నుంచి నిరసనలు మిన్నంటాయి. పోలీసులు తనను గుర్తు పట్టకుండా ఉండేందుకు రఫీ గుండు గీయించుకుని మరీ పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు నాలుగు రోజుల వ్యవధిలోనే వలపన్ని మరీ మహ్మద్ రఫీని ఛత్తీస్‌గఢ్‌లో అరెస్టు చేశారు.

రఫీ నేరచరిత్ర ఘనం…
నిందితుడు మహ్మద్ రఫీ స్వస్థలం మదనపల్లె మండలం బసిని కొండ. రఫీ ప్రవర్తన సరిగా లేదని అతని భార్య వదిలేసి వెళ్లిపోయింది. దీంతో అప్పట్నించీ రఫీ జులాయిగా తిరుగుతున్నట్లు పోలీసులు విచారణలో తేలింది. ఇప్పుడే కాదు ఇదివరకు కూడా చిన్నారులపై రఫీ రెండుసార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఓ కేసులో జైలుకెళ్లి రెండు నెలల కూడా ఉన్నాడు. తర్వాత కూడా తన తీరు మార్చుకోకుండా చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.. ఘోరంగా చంపేశాడు…

చివరి వాదనలను ఆలకించిన మెజిస్ట్రేట్..
రఫి చివరి వాదనలను కూడా మెజిస్ట్రేట్ ఆలకించారు. తనకు భార్య, కుటుంబం ఉందని వదిలేయాలని వేడుకున్నాడు. కానీ మెజిస్ట్రేట్ అత్యంత దారుణంగా చిన్నారిని హతమార్చడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. కాగా, ఈ కేసులో నిందితుడు మహ్మద్ రఫీకి వీలైనంత త్వరగా ఉరిశిక్షను అమలు చేయాలని బాధిత చిన్నారి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులతో పాటు ప్రతి ఒక్కరూ కోరుతున్నారు.

Execution to Accused in Rape case
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News