Tuesday, April 30, 2024

దేశవ్యాప్తంగా మెట్రో సిటీలలో ఎఫ్45 సేవల విస్తరణ

- Advertisement -
- Advertisement -

F45 services

 

హైదరాబాద్ : ఆస్ట్రేలియాలో పుట్టిన ఎఫ్45 శిక్షణను ప్రపంచ వ్యాప్తంగా విస్తరించేందుకు తాము కృషి చేస్తున్నామని ఎఫ్ 45 కలెక్టివ్ ఫిట్‌నెస్ కోఫౌండర్స్ సంజయ్‌రెడ్డి, ప్రీత్ గోనాలు హైదరాబాద్‌లో మీడియాకు వెల్లడించారు. 45 నిమిషాల పాటు ఫిట్‌నెస్ క్లాస్‌లు కొనసాగనున్నాయన్నారు. రోజుకొక కొత్త అంశంతో అన్ని విధాలుగా ఆరోగ్యకర రీతిలో ఈ శిక్షణ ఉంటుందని తెలిపారు. తమ ఎఫ్ 45లో చేరాలనుకునేవారికి ముందుగా శిక్షణకు సంబంధించిన అంశాలను పూసగుచ్చినట్లు వివరించడం జరుగుతుందని, ఆ తర్వాత నచ్చితేనే వారు తమ ఎఫ్ 45లో మెంబర్స్‌గా చేరవచ్చునని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆరేళ్ల వ్యవదిలో 45 దేశాల్లో 1750 ప్రాంచైజీస్ అమ్మకాలు జరిగాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎఫ్45 స్టూడియోలను 1300 ప్లస్ స్థాపించడం జరిగిందన్నారు.

ఆస్ట్రేలియాలో 570 ప్లస్ , యూఎస్‌లో 400 ప్లస్, ఇండియాలో 27 ప్లస్ స్టూడియోలను విక్రయించడం జరిగిందన్నారు. ఇండియాలో ఎఫ్45 స్టూడియోలను విరివిగా స్థాపించాలని నిర్ణయించామన్నారు. అంటే ఇండియాలో మొత్తంగా 13 సిటీలలో ఎఫ్45 స్టూడియోలను 27 నెలకొల్పడం జరిగిందన్నారు. హైదరాబాద్‌లోనే తొమ్మిది ఎఫ్45 స్టూడియోలు విక్రయించామన్నారు. వాటిలో మూడు ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ పర్యవేక్షణలో నడుస్తున్నాయన్నారు. తామిచ్చే ఫ్రాంచైజీస్‌లలో 60 శాతం మంది మహిళా నిర్వాహకులే ఉన్నారని గుర్తు చేశారు. మెరుగైన శిక్షణకు ఎఫ్45 పెట్టింది పేరన్నారు. తాము ఫ్రాంచైజీస్‌లకు ఇచ్చినప్పటికీ పర్యవేక్షణ బాధ్యత మాత్రం తమదేనని వారు స్పష్టం చేశారు. మరింతగా ఎఫ్45 స్టూడియోలను విస్తరించాలన్నది తమ ధ్యేయమన్నారు.

అందునా హైదరాబాద్‌లో మరిన్ని నెలకొల్పాలని కృతనిశ్చయంతో ఉన్నామన్నారు. తాము నిర్వహించబోయే ఎఫ్45 కోర్సులో ఫీజుల విషయానికి సంబంధించి ఆయా ఎఫ్45 స్టూడియోలను నిర్వహించే నిర్వాహకులదే అంతిమ నిర్ణయమని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పుకొచ్చారు. ప్రధానంగా దేశవ్యాప్తంగా మెట్రో సిటీలలో ఎఫ్45 స్టూడియోలు మరిన్ని నెలకొల్పాలన్నదే తమ ధ్యేయన్నారు. ఇందుక సంబంధించి తర్ఫీదు పొందిన శిక్షకులు ఉన్నారన్నారు. అంతిమంగా క్లయింట్స్‌కు, ఫ్రాంచైజీస్‌లకు మధ్య తాము వారధిగా నిలుస్తూ వారిని ఎఫ్45లో భాగస్వాములను చేయడమే తమ లక్షమన్నారు.

 

Expansion of F45 services in Metro cities Nationwide
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News