Tuesday, May 7, 2024

అధ్యాపకులు అకౌంటింగ్ సదస్సుకు హాజరుకావడం గర్వనీయం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఓయూ అధ్యాపకులకు త్రివేండ్రంలో జరిగిన అఖిలభారత అకౌంటింగ్ సదస్సులో లభించిన గౌరవం పట్ల ఇండియన్ అకౌంటింగ్ అసోసియేషన్, ఉస్మానియా వాణిజ్య విభాగం హర్షం వ్యక్తం చేశాయి. శుక్రవారం ఓయూలో జరిగిన సమావేశంలో సిఎంఏ, ఇండియన్ అకౌంటింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సీనియర్ ప్రొఫెసర్ వి. అప్పారావు, ఇండియన్ అకౌంటింగ్ అసోసియేషన్ జాయింట్ ట్రెజరర్‌గా ఎంపికైన డాక్టర్ గడ్డం నరేష్ రెడ్డి, 46వ ఐఎఎ టెక్నికల్ సెషన్‌కు కో-ఛైర్‌పర్సన్‌గా ప్రొఫెసర్ శేఖర్, సభ్యులుగా ఎంపికైన సీనియర్ ప్రొఫెసర్. చెన్నప్ప, వెంకటేష్‌లను అభినందించారు.

అదే విధంగా 45వ ఆల్ ఇండియా అకౌంటింగ్ కాన్ఫరెన్స్‌లో అత్యుత్తమ అకడమిక్ పనితీరు, ఉత్తమ పేపర్ అవార్డును గెలుచుకున్నందుకు డాక్టర్ రవీంద్రనాథ్ సోలమన్, సీనియర్ ప్రొఫెసర్ వి. ఉషా కిరణ్, కె. సవిత, డాక్టర్ నాజియా సుల్తానాలను సభ్యులు సత్కరించారు. ఈసందర్భంగా రెండు రోజుల జాతీయ సెమినార్, రెండవ జాతీయ డాక్టోరల్ కాన్‌క్లేవ్‌లో వాణిజ్య విభాగం బ్రోచర్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అండ్ సస్టైనబుల్ అకౌంటింగ్ డైమెన్షన్స్ అండ్ డైరెక్షన్స్‌ను ఆవిష్కరించారు. ఈ ఈవెంట్‌లు వరుసగా 2024 జనవరి,ఏప్రిల్‌లో జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్‌కు చెందిన అధ్యాపకులు విభాగాధిపతి ప్రొఫెసర్ డి.చెన్నప్ప, డీన్ ప్రొఫెసర్ ఎం. గంగాధర్, ప్రొఫెసర్ కె. కృష్ణ చైతన్య, చైర్‌పర్సన్, ఐఎఎ లైఫ్ సభ్యులు, అధ్యాపకులు, పరిశోధకులు హాజరయ్యారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News