Tuesday, May 7, 2024

షేన్‌వార్న్ క్షమాపణ చెప్పాల్సిందే..

- Advertisement -
- Advertisement -

Fans demand apology from Shane Warne for making racist remarks

 

అడిలైడ్: భారత ఆటగాడు చటేశ్వర్ పుజారాపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం లేపాయి. భారత్‌ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న డేనైట్ టెస్టు మ్యాచ్‌కు వార్న్ కామంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ సందర్భంగా పుజారాను ఉద్దేశించి వార్న్ వాడిన ఓ పదంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్‌లో యార్క్‌షైర్ తరఫున ఆడిన సమయంలో పుజారాను ఆ జట్టు క్రికెటర్లు కొందరూ స్టీవ్ అని పిలిచే వారని వార్న్ పేర్కొన్నాడు. అయితే స్టీవ్ అనే పదం జాతి వివక్షకు నిదర్శనమని, ఈ పదాన్ని ఉపయోగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గతంలోనే కౌంటీ క్రికెట్ నిర్వాహకులు నిర్ణయించారు. స్టీవ్ అనేది జాత్యాహంకర పదం అని తెలిసి కూడా వార్న్ కావాలనే దీన్ని ఉపయోగించాడని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పుజారాపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన వార్న్ క్షమాపణ చెప్పాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News