Wednesday, November 6, 2024

చదువుకోవడం లేదన్న కోపంతో కొడుక్కి నిప్పు

- Advertisement -
- Advertisement -

టివి చూస్తున్న కుమారుడిపై టర్పెన్‌టైన్ ఆయిల్
పోసి అగ్గిపుల్ల గీసిన తండ్రి, 60% గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చరణ్
హైదరాబాద్ కెపిహెచ్‌బిలో ఘటన

మన తెలంగాణ/ కేపీహెచ్‌బి: తరచూ టీవీ చూస్తూ సరిగ్గా చదవడం లేదని కోపగించిన తండ్రి కొడుకుపై టర్పెంట్ ఆయిల్‌పోసి నిప్పంటించారు. ఆసుపప్రతిలో కొడుకు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ సంఘటన కేపీహెచ్‌బి పోలీసు స్టేషన్‌పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్‌బికాలనీ రోడ్డు నెంబరు 2లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న రతలావత్ బాలు భార్య, నలుగురు పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కొడుకుల్లో చిన్న వాడైన చరణ్ (6) స్థానికంగా ఉండే ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. కాగా ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఇంటికి వచ్చిన బాలు ఇంట్లో టీవీ చూస్తున్న చరణ్‌ని బీడీ కట్ట తీసుకురావాల్సిందిగా బయటకు పంపించాడు. బయట నుంచి వచ్చిన చరణ్ తండ్రికి బీడి కట్ట ఇచ్చి తిరిగి టీవీ చూస్తుండగా కోపంతో ఊగిపోయిన బాలు కొడుకును తీవ్రంగా కొట్టాడు. సరిగ్గా చదువుకోకుండా తరచూ టీవీ చూస్తున్నావంటూ పక్కనే ఉన్న టర్పెంట్ ఆయిల్ పోసి అగ్గిపెట్టెతో నిప్పంటించాడు. దీంతో చరణ్‌కు తీవ్రగాయాలు కావడంతో తల్లి వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించింది. దాదాపు 60శాతం గాయాలతో ఆసుపత్రిలోచికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. కొడుకుకు నిప్పింటించిన తండ్రి బాలుపై కేపీహెచ్‌బి పోలీసులు కేసు నమోదు చేశారు.

Father sets Son on fire in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News