Sunday, April 28, 2024

కూతురిని విక్రయించిన తండ్రి

- Advertisement -
- Advertisement -
Father Sold Daughter in Hyderabad
తల్లివద్దకు చేర్చిన పోలీసులు

హైదరాబాద్: కన్నతండ్రే కూతురును విక్రయించిన సంఘటన నగరంలోని చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…. స్థానికంగా ఉంటున్న యాచకురాలు తన కూతురును భర్త విక్రయించినట్లు చాదర్‌ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి బాధితురాలి భర్త నెల వయస్సు ఉన్న బాలికను రూ.70,000కు విక్రయించాడు. ఎల్బినగర్, ఎన్టీఆర్ నగర్‌కు చెందిన అప్రిన్ అనే మహిళకు విక్రయించినట్లు తెలుసుకున్న పోలీసులు బాలికను తీసుకుని తల్లికి అప్పగించారు. శిశువు విక్రయాలపై దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్‌స్పెక్టర్ తెలిపారు.

Father Sold Daughter in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News