Thursday, May 2, 2024

మోడెర్నా టీకా అత్యవసర వినియోగానికి ఎఫ్‌డిఎ గ్రీన్ సిగ్నల్

- Advertisement -
- Advertisement -

FDA green signal for emergency use of Moderna vaccine

 

వాషింగ్టన్: కొవిడ్19 నిరోధానికి మోడెర్నా రూపొందించన టీకా అత్యవసర వినియోగానికి అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్‌డిఎ ఆమోదం తెలిపింది. వ్యాక్సిన్లపై ఎఫ్‌డిఎలోని ప్రత్యేక విభాగం విఆర్‌బిపిఎసిలోని నిపుణుల సమావేశంలో మోడెర్నాకు 200 మెజారిటీతో ఆమోదం లభించింది. మోడెర్నా వ్యాక్సిన్‌ను ఎంఆర్‌ఎన్‌ఎతో రూపొందించారు. వారం రోజుల క్రితం అత్యవసర వినియోగానికి ఆమోదం పొందిన ఫైజర్ టీకాను కూడా ఎంఆర్‌ఎన్‌ఎతో రూపొందించారు. అయితే, ఫైజర్ టీకాను మైనస్ 70 డిగ్రీల సెంటీగ్రేడ్(అతి శీతల పరిస్థితి)లో నిల్వ చేయాలి. మోడెర్నా టీకాలను 2 నుంచి 8 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద కూడా నిల్వ చేసే వీలున్నది. మోడెర్నా మూడోదశ ట్రయల్స్ ప్రాథమిక ఫలితాలను నవంబర్ 30న ఆ సంస్థ వెల్లడించింది. 94.1 శాతం సామర్థ్యాన్ని తమ టీకా రుజువు చేసిందని ఆ సంస్థ తెలిపింది. ఇప్పటికే అమెరికాలో 3,10,000మంది కరోనాతో మరణించారు. దాంతో, అక్కడ టీకాల కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసేందుకు ఎఫ్‌డిఎ నిర్ణయం దోహదపడుతుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News