Sunday, April 28, 2024

త్వరలో ఇల్లు కట్టుకునే వారికి ఆర్థిక సాయం: మంత్రి హరీశ్‌

- Advertisement -
- Advertisement -

Financial assistance to those who will build house soon

సిద్దిపేట: నూతన ఆర్థిక సంవత్సరం నుంచి సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకునే వారికి ప్రభుత్వం తరుపున ఆర్థిక సాయం అందిస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం సిద్దిపేట మున్సిపాలిటీ 29 వార్డు పరిధిలో రూ. 2కోట్లతో పలు అభివృద్ధి పనులు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వీటిలో రెడ్డి కమ్యూనిటీ హాల్, ముదిరాజ్ కమ్యూనిటీ హాల్, ఎస్సీ ఫంక్షన్ హాల్, ప్రారంభించారు. అనంతరం స్మశాన వాటికతో పాటు 26వ వార్డు నుంచి 34 వ వార్డు వరకు రూ. 50 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఎస్సీ కాలనీ ఫంక్షన్ హాల్ కు మరో రూ .5లక్షలు కేటాయించి వంట గది నిర్మాణం చేస్తామన్నారు. మున్నూరు కాపు సంఘానికి మరిన్ని నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.

సిద్దిపేట అభివృద్ధిలో దూసుకుపోతున్నదని డబుల్‌బెడ్‌రూంలను అర్హులందరికీ కేటాయిస్తామని అన్నారు. ఇమాంబాద్ గ్రామం ఒకప్పుడు ప్రాజెక్టులో పోతుందనే భయపడ్డారని కానీ ఇప్పుడు ఇక్కడి భూములకు రెక్కలు వచ్చాయని అన్నారు. ప్రతి యేటా దసరా పండుగ వేడుకలకు ఇమాంబాద్‌కు వస్తే ఎంతో ప్రేమ చూపుతున్నారని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. యూజీడీ పనులు పూర్తయితే దోమల భాద ఉండదని అన్నారు. వార్డు యువత కోసం అధునాతన జిమ్ ఏర్పాటు చేస్తానని అన్నారు. రూ. 10 కోట్లతో బటర్‌ఫ్లై దీపాలు, నాలుగు లైన్ల రోడ్డు నిర్మిస్తానని అన్నారు. కట్టపైకి డాంబర్ రోడ్డు కోసం నిధులు సమకూరుస్తానని హామీ ఇచ్చారు. ఇమాంబాద్‌లో వార్డు ఆఫీసు ఆధునీకికరణ, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తానని అన్నారు భూ బాధితులకు చేపలు పట్టుకునేలా హక్కు కల్పిస్తానని అన్నాఉ. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, కౌన్సిలర్ ఉమారాణి, కో ఆప్షన్ సభ్యులు జక్కుల రాజయ్య, ఆయా సంఘాల అధ్యక్షులు , వార్డు ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News