Wednesday, April 2, 2025

జియాగూడలో అగ్నిప్రమాదం: ఒకరు మృతి చెందగా, మరికొందరికి గాయాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జియాగూడలోని ఫర్నిచర్ తయారీ యూనిట్‌లో మంగళవారం రాత్రి  మంటలు చెలరేగడంతో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. రాష్ట్ర అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, నాలుగు అంతస్తుల భవనంలో ఈ సంఘటన జరిగింది. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో మంటలు చెలరేగడంతో 25 మంది ఇరుకున్నారు.

“ ఉదయం 1.22 గంటలకు కాల్ వచ్చింది. మా బృందం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంది. భవనంలో చిక్కుకున్న పలువురిని రక్షించారు. ఒకరు మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలను ఇంకా గుర్తించలేదు, అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నాము ”అని జియాగూడలో ఉన్న అగ్నిమాపక అధికారి తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News