Sunday, May 5, 2024

సేలంలో వంటగ్యాస్ సిలిండర్ పేలి ఐదుగురి మృతి

- Advertisement -
- Advertisement -

Five killed as cooking gas cylinder explodes in Salem

 

సేలం(తమిళనాడు): నగరంలోని కరుంగల్‌పట్టిలో ఒక ఇంట్లో వంట గ్యాస్ సిలిండర్ పేలి మూడు భవనాలు కూలిపోవడంతో ఐదుగురు మరణించారు. మృతులలో ముగ్గురు మహిళలు ఉన్నారు. మంగళవారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. భవనాల శిథిలాల కింద చిక్కుకున్న ఒక ఐదేళ్ల బాలికతోసహా 12 మందిని సహాయక సిబ్బంది రక్షించి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. శిథిలాల కింద మరికొందరు ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. జిల్లా కలెక్టర్ కార్మేఘం, పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News