Friday, May 3, 2024

హెలికాప్టర్ ప్రమాదంలో ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

Five members dead in Helicopter incident

అలాస్కా: హిమనీ నదాన్ని హెలికాప్టర్ ఢీకొట్టిన సంఘటన అమెరికాలోని అలాస్కా ప్రాంతంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. విమానయాన అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… యాంకరేజ్ నగరంలోని క్నిక్ అనే హిమానీనదాని ఢీకొట్టడంతో ఐదుగురు మృత్యువాతపడ్డారు. మృతులలో పైలట్ కూడా ఉన్నాడు. ఈ ప్రాంతంలో విమాన రాకపోకలపై ఫెడరల్ ఏవియేషన్ ఆంక్షలు విధించింది. రెస్క్యూ బృందాలు, ఆర్మీనేషనల్ బృందాల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. మెక్సికలోని అరిజోన్ ప్రాంతంలో శనివారం జరిగిన విమాన ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. టెకాఫ్ తీసుకుంటుండగా ఈ ప్రమాదం జరిగినట్టు విమానయాన అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News