Tuesday, April 30, 2024

పాత డ్రైవింగ్ లెసెన్స్‌లు.. కొత్త సమస్యలు

- Advertisement -
- Advertisement -

రవాణాశాఖ ఆన్‌లైన్‌లో లభ్యం కాని డ్రైవింగ్ లైసెన్స్‌ల డేటా
రెండు లైసెన్స్‌లు ఉండకూడదంట్నున అధికారులు
అప్పుడెలా ఇచ్చారంటున్న వాహనదారులు
రెండు లైసెన్స్‌లను కలపాలని డిమాండ్

Central Government Driving License Validity Extended

మన తెలంగాణ/ సిటీబ్యూరో: రవాణాశాఖ అధికారులు వాహనదారు లు సౌలభ్యం కోసం ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తెచ్చినా డ్రై వింగ్ లైసెన్స్‌ల సమస్యల్లో పరిష్కారం చూపలేక పోతుందనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్‌ల రెన్యువల్‌కు సంబంధించి వాహనదారులు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా 20 సంవత్సరాల క్రితం డ్రైవింగ్ లెసెన్స్‌లు పొందిన వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు.

ముఖ్యంగా వాహనాలను బీమా చేసుకునే సమయంలో రవాణాశాఖలో నాటి వాహనదారులు డేటా లభ్యం కావడంతో బీమా కంపెనీలు సంబంధిత వ్యక్తుల వాహనాలకు బీమాకు సంబంధించిన ధృవపత్రాలను తిరస్కరిస్తున్నాయి. పాత లైసెన్స్‌లకు సంబంధించి డేటా లభ్యం కాకపోవడంతో వారు సకాలంలో తమ లైసెన్స్‌లు రెన్యువల్ చేసుకోలేకపోతున్నారు. దీంతో వారు పెద్దమొత్తంలో ట్రాఫిక్ చలానాలు చెల్లించాల్సి వస్తోంది. అంతే కాకుండా తమకు సంబంధించిన వాహనాలకు ఏదైనా అనుకోని ప్రమాదం ఏర్పడినప్పుడు సదరు వాహనాలకు ఇన్సూరెన్స్ క్లైమ్ చేసుకోనేందుకు డేటా లభ్యం కాకపోవడంతో సమస్యలను ఎదుర్కొంటున్నారు.

అప్పుడలా.. ఇప్పుడిలా

ప్రస్తుత పరిస్థితులు పోలిస్తే రవాణాశాఖకు సంబంధించిన సేవల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. గతంలో ద్విచక్రవాహనాలకు, కార్లకు వేర్వేరుగా రవాణాశాఖ అధికారులు వేరువేరుగా లైసెన్స్‌లు జా రీ చేశారు. కాని ఇప్పుడు వాటిని వాహనదారులు రెన్యువల్ చేసుకోవడంలో సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తోంది. అంతేకాకుండా ప్రస్తుతం ఒక వ్యక్తికి రెండు లైసెన్స్‌లు ఉంటే ఒకటి రద్దు చేసుకోవాల్సిందే అధికారులు చెబుతున్నారు. అంతే కాకుండా ఒక లైసెన్స్‌ను రద్దుచేసుకుని తిరిగి మళ్ళీ స్లాట్‌బుక్ చేసుకోవడం ద్వారా లెర్నింగ్ లైసెన్స్‌తో డ్రౌ వింగ్ లైసెన్స్‌ను పొందాలని చెబుతున్నారు. దీంతో తాము వాహనాలు నడపడంలో ఎంతో అనుభవం ఉండి మళ్ళీ తిరిగి కొత్తగా లెసెన్స్ పొందడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఒకే వ్యక్తి రెండు వాహనాలను కలిగి ఉండటంలో లేని తప్పు రెండు లైసెన్స్‌లు ఉంటే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. రెండు డ్రైవింగ్ లైసెన్స్‌లను కలిగి ఉండటంతో తప్పయితే గతంలో తాము సంబంధిత రవాణాశాఖ నుంచి పొందిన లైసెన్స్‌లను క్లబ్ చేసి రెండింటిని కలిపి ఒకటిగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

అంతే కాకుండా ఆన్‌లైన్‌లో తమ పాత లైసెన్స్‌లను అప్‌డేట్ చేసుకునే అవకాశం ఇవ్వాలని చెబుతున్నారు. అంతే కాకుండా గతంలో ఎవరైతే రెండు లైసెన్స్‌లు (ద్విచక్ర, లైట్‌మోటార డ్రైవింగ్) కలిగిన ఉన్నవారు కొత్తగా స్లాట్‌బుక్ చేసుకుని కొత్తగా డ్రౌవింగ్ పొందాలనే నిబంధను సడలించాలని డిమాండ్ చేస్తున్నారు. రెండు లైసెన్స్‌లను క్లబ్ చేసేందు కు సంబంధిత ఫీజును అదనంగా వసూలు చేస్తే ఇటు రవాణాశాఖకు ఆదాయం రావడమే కాకుండా అటు వాహనదారుల లైసెన్స్ సమస్యకూడా పరిష్కారం అవుతుందంటున్నారు.ఇదే అంశంపై తాము అవసరం అనుకుంటే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని చెబుతున్నారు. ఇప్పటికే ఇదే అంశంపై కొంత కోర్టు అనుమతి ద్వారా కొంత మంది లైసెన్స్‌లను పొందినట్లు తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News