Friday, May 3, 2024

ఆగిన వరద సాయం

- Advertisement -
- Advertisement -

Flood Relief Fund Stopped in GHMC

హైదరాబాద్: వరద బాధితులు తక్షణ ఆర్థిక సహాయం కోసం ‘పది వేల’ కష్టాలు పడ్డారు. అయితే ఫలితం మాత్రం దక్కకుండా పోయింది. జిహెచ్‌ఎంసి ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ముగిసే వరకు వరద సాయాన్ని తక్షణమే నిలిపివేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేయడంతో బాధితులు తీవ్ర అక్రోశానికి గురైయ్యారు. పలువురు కంట తడి పెట్టుకున్నారు. వరద ముంపుతో సర్వం కొల్పొయిన తాము ఎముకలు కొరికే చలిని కూడా లెక్కచేయకుండా తెల్లవారు జాము 4 గంటల నుంచి గంటల తరబడి మీసేవల ముందు పడిగాపులు కాశామని ఆవేదన వ్యక్తం చేశారు.

మంగళవారం విడుదలైన జిహెచ్‌ఎంసి ఎన్నికల నోటిఫిషన్ తర్వాత వరద సహాయం బ్యాంకుల ద్వారా అందించవచ్చాని పేర్కొన్న ఎన్నికల సంఘం బుధవారం నిలిపివేయాలన్ని ఉత్తర్వులు జారీ చేయటమేమింటి వాపోయ్యారు. ఎన్నికల కోడ్ కారణంగా నిలిపివేస్తున్న ప్రకటించిన ఎన్నికల మంగళవారం నుంచే కోడ్ అమల్లోకి వచ్చినప్పుడు అదే రోజు ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. అగ్రహంతో ఎక్కడికక్కడ బాధితులు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. ఉత్తర్వు జారీ వివరాలు మీ సేవలకు అందడంతో వెంటనే రిజిస్ట్రేషన్ల నిలిపివేసి మీసేవలను మూసివేశారు.దీంతో ఉదయం నుంచి క్యూలైన్లలో వేచియున్న బాధితులు అగ్రహాంతో ఊగిపోయ్యారు. మీసేవల ముందే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

Flood Relief Fund Stopped in GHMC

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News